తెలుగును ప్రపంచ భాషగా మారుద్దాం!!



మిత్రులందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!

శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టిన రోజు

ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

తెలుగు భాషకు ఆధునిక హోదా సాధిద్దాం!

తెలుగును ప్రపంచ భాషగా మారుద్దాం!!

- ఆనంద్ కూచిభొట్ల

తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా శుబాకాంక్షలు.

అంతర్జాలం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడదాం…

- తుర్లపాటి నాగభూషణ రావు

తేనెలొలుకు మన తెలుగు భాష

వెన్నెలచందముగ వెలుగు భాష.

వేల వత్సరముల ప్రాచీన భాష

వేద భూమిపై వెలసిన భాష

పదహారణాల పసందైన భాష

పద్యాల పదునున్న హృద్యమైన భాష

రామాయణమందించిన కవయిత్రి మొల్ల భాష

భారతమ్ము రచియించిన కవిత్రయమ్ము భాష

వేంకటేశ్వరుని కొలిచిన అన్నమయ్య భాష

శ్రీ రాముని కీర్తించిన త్యాగయ్య భాష

భద్రాచల రాముని సేవించిన కంచెర్ల గోపన్న భాష

శతకములో బతుకు బాట చూపిన యోగి వేమన్న భాష

పంచదార భాష, పాల బువ్వ భాష

తేనె లొలుకు భాష..ఎంకి కులుకు భాష  మన తెలుగు భాష

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ

తెలుగుభాషా దినోత్సవం శుభాకాంక్షలు

-కస్తూరి ఫణి మాధవ్

తెలుగువాళ్ళం మ‌నం.. మ‌న భాష‌ని ప‌రిర‌క్షించుకుందాం..

ఎక్క‌డ సంత‌కం చెయ్యాల్సివ‌చ్చినా తెలుగులోనే చేద్దాం..

ఇది తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నం..

త‌ప్ప‌నిస‌రైతే త‌ప్ప, అన్నివేళ‌లా తెలుగులోనే

మాట్లాడుదాం.. తెలుగులోనే వ్రాద్దాం..

ఇది తెలుగ‌వాడి ఆత్మ‌గౌర‌వానికి సంకేతం..

తెలుగుభాషా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు..

-ఎస్‌.వి. కృష్ణ‌

తేట‌తెలుగు భాష‌..

తేనె లొలుకు భాష‌..

మ‌న భాష‌కి ప‌డుతుంది తెగులు..

క‌నిపించ‌ని ఏదో తెలియ‌ని ప‌గులు..

మ‌న‌మంతా క‌లిసి ప‌రిర‌క్షిస్తేనే

ముందు త‌రాల‌కి తెలుగు భాష మిగులు..!

తెలుగుభాషా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు

-చెడుదీపు సంతోష్‌కృష్ణ‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!