విప్లవ ‘మాత్ర’ – వైకుంఠ యాత్ర



యాత్రలిచ్చు ఓదార్పు

యాత్రలిచ్చు ఓర్పు!

రాజకీయమెంతో నేర్పు!

పదవులు పట్టే నేర్పు!

ఆమోదం పొందదేల నా రాజీనామా!

పొందకుంటే పదవికదే పెద్ద వీలునామా!

రాజీనామా చెయ్ ! రోడ్డు మీద రచ్చ చెయ్!

పదవి పట్టి వేళ్ళాడుతూ ఉద్యమాల ‘ఉచ్చు’ వెయ్!

అవినీతికి విత్తనం నేటి రాజకీయం!

జనంపైన పెత్తనం నేటి రాజకీయం!

కలివిడిగా ఉంటే కాదట అది ప్రగతి!

విడిపోతే పడిపోతే అది ‘వారికి’ పురోగతి!

యముని మహిషపు లోహఘంట కాదోయి ఉద్యమం

‘భజన’ ‘విభజన’ కాదోయ్ జనం కోరే ఉద్యమం!

నీ పదవికి హామీలు ఇవ్వదోయ్ ఉద్యమం!

విజ్ఞతకు,  త్యాగానికి చిరునామా ఉద్యమం!

‘చిరు’ జట్టుతో నిలిచేనా నీతిలేని ప్రభుత!

చిరుగాలికి ఆరునా పెను కాంగ్రెస్ ఘనత!

వేయి గొడ్లు తిన్నాక పెద్ద రాబందు -

కథ కూడా బందుకదా ‘జనమే’ కామందు!

- చల్లా రామ ఫణి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!