భారత మాత – సెకండ్ ఇన్నింగ్స్ -1



భారత దేశం 65వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆరుపదుల భారతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది…
ఆరుపదుల సుదీర్ఘ ప్రస్తానంలో మనం ఏం సాధించాం…? జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుకన్న రాజ్యస్థాపన జరిగిందా.. నెహ్రూ ఆశయాలు నెరవేరాయా…? అసలు మనం ఎటు పయనిస్తున్నాం… భారత మాత  సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉందో తెలుసుకుందాం..

నీటి కాలుష్యం కారణంగా, ఏటా 5, 50,000 మంది అతిసారబారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరేదేశంలో లేదు.
దేశంలోని నాలుగింట మూడోవంతు జనాభా కేవలం రోజుకు 20 రూపాయలతోనే కడుపు నింపుకుంటున్నారు.

వరద సహాయక నిధులు దారిమళ్లుతున్నాయి. బాధితుల కన్నీళ్లకు సైతం కరగిపోని నేతలు మనదేశంలోనే ఎక్కువగా ఉన్నారు.
స్వాతంత్ర్యం వచ్చే సమయంలో మన జనాభా 40 కోట్లు. అది ఇప్పుడు 120 కోట్లకు చేరుకుంది. అయితే చాలా చిత్రంగా నాటి సమస్యలే నేడు విలయతాండవం చేస్తున్నాయి.

మనదేశం పోరాటాల గడ్డ.
మనదేశం ధైర్యసాహసాలకు ప్రతీక
మనదేశం ప్రతిభాపాటవాలకు పుట్టినిల్లు
అయినా ఎక్కడో నైరాశ్యం. మరెక్కడో నిరాశ.

స్వాతంత్ర్యం సిద్ధించి 64 ఏళ్లు అయినా ప్రగతి చక్రాలు వేగం పుంజుకోలేదు. ఎందుకిలా జరుగుతోంది? ఓసారి ఆలోచించాల్సిందే…
ప్రాధాన్యతలు అన్న మాట వినేఉంటారు. ఇది ఒక వ్యక్తికో లేదా ఒక సంస్థకో మాత్రమే పరిమితం కాదు. దేశానికి కూడా చాలా అవసరం. సందర్భోచితంగా ప్రాధాన్యతల క్రమంరుతుండవచ్చు, కానీ ఏ పని ముందు చేయాలీ, మరేపని నిదానంగా చేసుకోవాలన్న స్పష్టమైన ఆలోచన లేకపోతే, ఇటు కుటుంబమైనా, అటు దేశమైనా బోల్తా పడటం ఖాయం. ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే…
ప్రాధాన్యతలన్నవి మారుతుంటాయి. అలాగే, దేశానికి కూడా ప్రాధాన్యత క్రమం మారుతుండాలి. అప్పుడే దేశ గమనం సరిగా ఉంటుంది. ఆర్థిక వేత్తలు చెబుతున్న సత్యం ఇదే…
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో మనదేశ ప్రజల స్థితిగతులు ఎలా ఉండేవంటే..

- తగినంత ఆహారోత్పత్తి లేదు.
- కట్టుకునేందుకు బట్టల కొరత
-  కొద్దిమందికే సొంత ఇళ్లు

స్వాతంత్ర్యం రావడానికి ముందే జాతిపిత బాపూజీ దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నాటి స్థితిగతులు తెలుసుకున్నారు. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా స్వాతంత్ర్య భారతంలో చర్యలు తీసుకోవాలని నెహ్రూకు సలహాలు ఇచ్చేవారు. స్వాతంత్ర్యం వచ్చాక అంటే, 1947లో రేషన్ కార్డుపై  రంగూన్ బియ్యం,  ఎర్ర కిరోసిన్ మాత్రమే ఇచ్చేవారు.
బియ్యం వంటి నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని అధిగమించడానికి తొలి ప్రధానమంత్రి నెహ్రూ  ప్రాధాన్యతా రంగాలపై దృష్టి పెట్టారు. వాటిలో ముఖ్యమైనవి…1. అధికోత్పత్తి, 2.  నిరుద్యోగ నిర్మూలన
దేశంలో ఆహారత్పోత్తి పెరిగితేనే అధికోత్పత్తి రాదు, అలాగే, ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తేనేకానీ, రెండో సమస్య తొలిగిపోదు. అందుకు సంయుక్తంగా ఎంచుకున్న మార్గాలు..

- నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం
- భాక్రానంగల్
- నాగార్జున సాగర్
- బొకారో ఉక్కు ప్యాక్టరీ
- పెరంబుదూరు కోచ్ ఫ్యాక్టరీ

స్వాతంత్ర్య భారత చరిత్ర తిరగేస్తే ప్రాధాన్యత క్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అర్థమవుతుంది.

- నెహ్రూ కాలంలో – ఆర్థిక వికాసం
- లాల్ బహదూర్ టైమ్ లో రక్షణ వ్యూహం
- ఇందిర హయాంలో రాజకీయ సుస్థిరత
- వాజ్ పేయ్ పాలనలో  జాతీయతా భావం
- మన్మోహన్ పాలనలో  ఉగ్రవాదం, ఆర్ధిక మాంద్యం

ప్రస్తుతం మనముందున్న ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి…

- అవినీతిపై ఉద్యమం
- ఆర్ధికమాంద్యాన్ని అరికట్టడం
- నిరుద్యోగ నిర్మూలన
- చైనా, పాకిస్తాన్ దాడులు, కవ్వింపులు
- జాతీయతా భావం స్థానే మత, కులతత్వాలు
- ప్రత్యామ్నాయ ఇంధనం

ఉద్యమ స్వరూపంలో కూడా నాటికీ, నేటికీ చాలా మార్పే వచ్చింది.  ఉదాహరణకు వ్యవసాయ సంబంధంగా ఉద్యమాలు చేసినా, ఆందోళన బాట తొక్కినా కేవలం రైతులే ఉద్యమ భాగస్వాములు అయ్యేవారు. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. నాగలి పట్టుకోవడం తెలియని నాయకుడు సైతం ఉద్యమాన్ని నడిపిస్తుంటాడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అసలు,  నాయకుడంటే ఎలా ఉండాలి?  నాయకులు ఎలా తయారవుతారు?  నాయకుల విజయం వెనుక దాగున్న రహస్యాలేమిటి ??
(ఈ వివరాలు తరువాయి భాగంలో)
- తుర్లపాటి నాగభూషణరావు
nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!