ఐఎఎస్‌, ఐపిఎస్‌ల లోనూ అవినీతి..


అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే ఈసారి ఐఎఎస్ , ఐపిఎస్ లపై విరుచుకుపడ్డారు. ఐఎఎస్,ఐపిఎస్ లు ప్రజలకు సేవచేయడం మరిచిపోయారని, లంచాలు మరుగుతున్నారని ఆరోపించారు. హజారే దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, లోక్ పాల్ పరిధిలోకి, గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రావాలని , అవినీతిని ఎక్కడా ఉపేక్షించే పరిస్థితి ఉండరాదని ఆయన అన్నారు. ప్రతి స్థాయిలోను అవినీతిపై పౌరుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు. అవినీతిని అరికట్టాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని హజారే అభిప్రాయపడ్డారు.లోక్ పాల్ పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రావలన్నారు. మూడు అంశాలలో తమకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!