హ‌జారే దీక్షకు టాలీవుడ్ మ‌ద్దతు


అన్నా హ‌జారే దీక్షకు తెలుగు చిత్రప‌రిశ్రమ మ‌ద్దతు తెలిపింది. మా అసోసియేషన్ అధ్యక్షుడు ముర‌ళీమోహ‌న్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద‌యం అన్నాకు మ‌ద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఫిలింన‌గ‌ర్ క‌ల్చర‌ల్ క్లబ్ నుండి రామానాయుడు స్టూడియో వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ర్యాలీలో సినిమారంగానికి చెందిన న‌టీన‌టులు, సాంకేతిక‌నిపుణులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముర‌ళీమోహ‌న్‌, రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, ఆలీ, త‌నికెళ్ళభ‌ణి త‌దిత‌రులు మ‌రియు సాంకేతిక నిపుణులు భారీగా పాలుపంచుకున్నారు. మూతికిన‌ల్లగుడ్డల‌ని క‌ట్టుకుని అవినీతికి వ్యతిరేకంగా ముందుకు క‌దిలారు. దేశ‌వ్యాప్తంగా అన్నాహ‌జారేకు మ‌ద్దతు ల‌భిస్తున్న త‌రుణంలో తెలుగు చిత్రప‌రిశ్రమ కూడా అన్నాకి మ‌ద్దుతు ప‌ల‌క‌డం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!