జ‌గ‌న్‌ని అరెస్టు చేస్తారా..?


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలపై, ఆయన కంపెనీలలో పెట్టుబడి పెట్టినవారి ఇళ్లు, కార్యాలయాలపై సిబిఐ దాడులు ఆరంభించింది. బుధవారం దీనిపై సిబిఐకోర్టు అనుమతి తీసుకున్న అధికారులు 12 బృందాలు ఏర్పాటుచేసుకుని దాడులు చేశారు.ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఐఎ ఎస్ అధికారి బి.పి.ఆచార్య ఇంటిపై కూడాదాడులు చేశారు. సాక్షి కార్యాలయం, భారతి సిమెంట్స్ , బెంగుళూరులోని జగన్ ఇంటి వద్ద కూడా సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా , దేశంలోనే సంచలనంగా ఉండే ఈ దాడులు ఏమి ఆధారాలు దొరుకుతా యన్నది ఆసక్తికరమైన అంశంగా ఉంది.అయితే ఇదే సమయంలో జగన్ ను కూడా అరెస్టు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది.జగన్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన ఓదార్పుయాత్ర ద్వారా జనంలోనే ఉంటున్నారని, ఒక వేళ అరెస్టయినా జనం మధ్యలోనుంచే అరెస్టు కావాలని భావిస్తున్నారని, తద్వారా జనం సానుభూతిని పొందాలని ఆయన చూస్తున్నారని కధనాలు వస్తున్నాయి.మొత్తం 91 చోట్ల ఈ సోదాలు, దాడులు చేసి ఏమి కనిపెడతారో చూడాలి.అయితే జగన్ కాని, ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు కాని అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!