హస్తినలో రాంచరణ్, ఉపాసన పెళ్ళి..?
తన కుమారుడు రాంచరణ్‌తేజ్ వివాహాన్ని ఘనంగా చేయడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.. అయితే చరణ్ పెళ్ళిని హైదరాబాద్‌లోనో, లేక తన సొంత గ్రామంలోనో కాకుండా ఏకంగా హస్తినలో అదే.. భారత రాజధాని ఢిల్లీలో చేయడానికి సిద్దపడు తున్నారు. ఈ పెళ్ళిని ఆయన రాజకీయంగా కూడా ఉపయోగించుకోవాలను కుంటున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే చిరంజీవి ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే.. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలనుకున్నాడు. అయితే సోనియా చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండడంతో చిరుకి నిరాశే ఎదురైంది. చరణ్ పెళ్ళిని హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో చేస్తే ఆ పెళ్ళికి సోనియాగాంధీ, ప్రధానమంత్రితో సహా కాంగ్రెస్ పెద్దలందరినీ ఆహ్వానించవచ్చు.. ఢిల్లీలోనే పెళ్ళి కాబట్టి తప్పకుండా అందరూ హాజరవుతారు.. దాంతో జాతీయ మీడియా ఈ పెళ్ళిని హైలెట్ చేస్తుంది. మీడియా ప్రచారం, కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం వెరసి రాం చరణ్ కూడా నేషనల్ లెవెల్‌లో గుర్తింపు సంపాదిస్తాడు. రాజకీయంగా కూడా చిరంజీవి క్రేజ్ పెరుగుతుంది.. ఇలా ఆలోచించే చిరంజీవి రాంచరణ్ పెళ్ళిని ఢిల్లీలో చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. మొత్తానికి తన కుమారుడి వివాహాన్ని కూడా రాజకీయంగా తనకి అనుకూలంగా మలుచుకునేంత పరిణతి రాజకీయాల్లో చిరంజీవి సంపాదించడం చూస్తుంటే.. ముందు ముందు రాజకీయాల్లో చిరంజీవి ఆరితేరిపోతాడనిపించట్లేదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి