దేవుడు చూసుకుంటాడు..


తన ఆస్తులపై సిబిఐ దాడులు చేయడం జగన్ నేరుగా స్పందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.అంతా దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనవైపే ఉన్నాడు.వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అప్రదిష్టపాలు చేయడానికి చూస్తున్నారు అని మాత్రమే వ్యాఖ్యానించి ఊరుకుంటున్నారు.సిబిఐ దాడుల నేపధ్యంలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తుంది. సిబిఐ దాడులు పూర్తి అయి వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం కనబడుతోంది.కాగా చంద్రబాబు మీద మాత్రం ఆయన విరుచుకుపడ్డారు.రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నిస్తున్నారు.వై.ఎస్ తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు మరచిపోయి వై.ఎస్.కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్, టిడిపి లు నైతిక విలువలు మర్చి కుమ్మక్కయ్యాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వీరికి డిపాజిట్లు రాకుండా ఓడిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం కృష్ణ జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ ఉన్నారు. వర్షంలో సైతం ఆయన తన యాత్ర కొనసాగించారు. నేరుగా సిబిఐని విమర్శించకుండా రాజకీయంగా మాత్రమే విమర్శించడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!