లండ‌న్ లోని తెలుగువాళ్ళ‌కి అండ‌గా యుక్త-1


ఇప్పుడు బ్రిటన్ లో పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి పడింది. పిల్లలను సరిగా పెంచకపోవడం వల్లనే ఇటీవలి లండన్ హింసా కాండ చెలరేగిందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారన్న వివాదం పెరిగి చివరికి లూటీలు, ఆస్తుల దహనాలకు దారితీసింది. అయితే ఆ ఘటన సాకుతో కొందరు హింసకు పాల్పడ్డారన్నది ప్రధాని అభిప్రాయం. పిల్లలను సరిగా పెంచి, చదువులు చెప్పి ఉంటే ఇలా దోపిడీలకు పాల్పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ప్రవర్తన ఉండేలా నేర్పవలసిన అవసరం ఉందని ఈ ఘటనలు తెలియచెప్పాయని ఆయన అన్నారు. ఈ దోపిడీ, హింసాకాండలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే యూరప్ సమాజంలో ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాలపై చర్చకు ఈ ఘటనలు తెరలేపాయి. చిన్న,చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం, పిల్లలను గాలికి వదలివేయడం వంటి అనేక ఘటనలు జరుగుతున్న నేపద్యంలో ఒక బాధ్యత అనేది కొరవడి ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇస్తోందని ప్రభుత్వం బావిస్తోంది. నైతిక విలువల విషయంలో కూడా శ్రద్ధ‌ వహించాలని ఇప్పుడు బ్రిటన్ సమాజం భావిస్తోంది.
ఈ నేప‌థ్యంలో లండ‌న్‌లో ఉన్న తెలుగువారి పిల్ల‌ల గురించి తెలుసుకోవాల‌న్న కుతూహ‌లం స‌హ‌జంగానే అంద‌రికీ క‌లుగుతుంది. బ్రిట‌న్ యువ‌త చెడుమార్గం వైపు ప‌య‌నిస్తుండడం, దానిపై ప్ర‌భుత్వం శ్ర‌ద్ద తీసుకోవ‌డం బాగానే ఉన్నా ప్ర‌వాసాంధ్రులకోసం ముఖ్యంగా తెలుగు యువ‌త కి అండ‌గా ఉండేవారెవ‌రు అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తుంది. అయితే ఈ ప్ర‌శ్న‌కి జ‌వాబుగా యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేష‌న్ (యుక్తా) వారు లండ‌న్‌లోని తెలుగు  యువ‌త‌కి దిశానిర్దేశం చేసేందుకు న‌డుంబిగించింద‌ని ఈ సంఘం మీడియా కార్య‌ద‌ర్శి శ్రీ ప్ర‌సాద్ మంత్రాల గారు చెప్పారు. లండ‌న్ లో ఉన్న తెలుగువారికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా తీర్చ‌డానికి యుక్తా ముందుటుంది. ఈ మ‌ధ్య‌నే యుక్తా ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వం జ‌రుపుకుంది. యుక్తా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో తెలుగువారు హాజ‌ర‌య్యారు.
లండ‌న్ లో నివ‌సించే తెలుగువారికి సాంస్కృతిక సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు, పై చ‌దువుల‌కోసం లండ‌న్‌కి వ‌స్తున్న‌ యుతీయువ‌కుల‌కు యునైటెడ్ కింగ్‌డం తెలుగు అసోసియేష‌న్ సంఘం త‌మ వంతు చేయూత‌నిస్తుంద‌ని, లండ‌న్‌లోని అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఇక్క‌డి తెలుగువారికోసం ప్ర‌త్యేక‌మైన శ్ర‌ధ్ద‌ని కూడా తీసుకుంటున్న‌ట్లు ప్ర‌సాద్ మంత్రాల చెప్పారు.
ప్ర‌సాద్ మంత్రాల గారితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ రెండ‌వ భాగంలో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!