లోక్ పాల్ తో మార్పు వచ్చేనా?




లోక్ పాల్ బిల్లు తీసుకురావాలని అధికార, ప్రతిపక్షాలతో పాటు పౌరసమాజం ..ఒక్క మాటలో చెప్పాలంటే యావన్మంది భారత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఎంత తొందరగా సాధ్యమయితే అంత తొందరగా ఈ బిల్లును తేవాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. ఐతే బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకురావాలని,
తీసుకు రావడం సబబు కాదనీ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రిని, ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థనూ బిల్లు పరిధిలోకి తెచ్చినంత మాత్రాన లోక్ పాల్ వల్ల దేశంలో అవినీతి మటుమాయమయి పోతుందన్న గ్యారంటీ ఉందా…అన్నది ప్రధానంగా వేసుకోవలసిన ప్రశ్న.
చట్టం తెచ్చినంత మాత్రాన సరిపోదని …ప్రభుత్వ విధానాలకు సంబంధించిన పలు నియమ నిబంధనలను సరళతరం చేసి, కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకోకుండా విచక్షణాధికారాలను తగ్గించి ప్రభుత్వ పనితీరు అందరికీ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటే తప్ప అవినీతిని రూపుమాపడం కష్టమని ప్రధానమంత్రి మన్మోహన్
సింగ్ చెప్పారు. లోక్ పాల్ ను అమలు చేయాల్సిన వ్యక్తి కూడా మానవమాత్రుడే కదా..ఆరోపణలనేటివీ ఒక రోజు కాకపోతే మరో రోజైన లోక్ పాల్ కు అన్వయించబడవా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. అవినీతి అనే  అంటువ్యాధి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన అంశంగా పాలకుల ముందు ఉంది. మరో మాటలో
చెప్పాలంటే అవినీతి మహమ్మారి వ్యాధి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని నిర్మూలించే బాధ్యతను లోక్ పాల్ భుజస్కందాలపై వేస్తే అవినీతి మటుమాయం అవుతుందో లేదోగానీ, ప్రధాని లాంటివారిని లోక్ పాల్ పరిధిలో చేరిస్తే ,చేయని తప్పులకు కూడా ప్రధానమంత్రి వంటివారిని దేశ ప్రజల ముందు, ప్రపంచం ముందు అవినీతిపరుడుగా
నిలబెట్టే అవకాశాలున్నాయి.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 64 సంవత్సరాలు అవుతోంది. అంతకు ముందు అవినీతి అనేది ఓ స్థాయికే పరిమైంది. డబ్బైవ దశకం నుంచి వేగవంతంగా విస్తరించింది. గతంలో ప్రభుత్వాల నుంచి కనీస అవసరాలు కూడా ప్రజలకు అందకపోయినా రకరకాల వృత్తులలో స్థిరపడిపోయి…ప్రభుత్వంతో మాకు పనిలేదు… మా కష్టమే మాకు అండ అని అనుకోనేవారు..నేడు అలా కాదు…చివరకు ఏలా అంటే నాలుగు డబ్బులు కూడబెట్టుకోవడానికి కాకపోతే ఈ మంత్రి , ఎమ్మెల్యే పదవులు, రాజకీయాలు మరెందుకూ అనే ఆలోచన నేతల్లో విస్తరించింది. మరో వైపు చట్టాలను అమలు చేయాల్సిన ఉన్నతాధికారులు ఇప్పుడు కాకపోతే మళ్లేప్పుడు నాలుగు రూకలు వెనకేసుకోనేది అనే భావన నాటుకుపోయింది. చట్టాలను తీసుకొచ్చే నేతలు…అమలు చేయాల్సిన అధికారులలో ఇలాంటి ఆలోచన వుంది కాబట్టే అవినీతి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రాకిపోయింది. దీనిని అంతం చేయడం జన లోక్ పాల్ కు సాధ్యమా…అంటే ఏవరు సమాధానం చెప్పరూ..అన్నాహజారే ఉద్యమం చేస్తున్నారు…తామెక్కడ వెనక్కి వెళితే అధికారానికి దూరమవుతామనే బెంగతో హుటాహుటిన అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన నేతల వరకు నేను సైతం అంటూ మద్దతు ఇస్తున్నారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ….జాతీయ స్థాయిలో కూడా అన్ని శాఖలలో మార్పు రావాలి. ఉన్నవాడు, లేనివాడు అనే భావన పోగోట్టడం..తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే… ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా కొన్ని కుటుంబాలు, వర్గాలు రాజకీయాలలో స్థిరపడిపోవడం ఒక కారణం అయితే… అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వ్యక్తులకు కాకుండా గ్రామాలలో కనీస మౌళిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యం… ప్రతి రంగంలోనూ అర్హతలకు తగ్గట్లు అవకాశాలు ఇచ్చేందుకు చట్టంలో మార్పులు తీసుకురావడం.. మూలాలలో మార్పు కోరకుండా కేవలం లోక్ పాల్ అంటూ రోడ్లపైకి రావడం వల్ల జనానికి ఒరిగేదేముంది. ఏలాగూ అన్నా దీక్షకు ఉపక్రమించాడు..ఇది మంచి పరిణామమే ..ఆయనైనా గ్రామాల వైపు దృష్టి సారించి మూలాలలో మార్పు కోరే విధంగా చట్టాలకు బీజాలు వేయగలడని కోరుకుందాం..


-  డాక్టర్ వేమా వెంకట రత్నం

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!