అన్నా హ‌జారే ఎవ‌రి సోద‌రుడు..?


ఉత్తరాది రాష్ట్రాలలో అన్నా హజారే గురించి భలే చర్చలు జరుగుతున్నాయి. అన్నా హజారేకి మద్దతుగా అన్ని ప్రాంతాలలో రకరకాలుగా ర్యాలీలు జరుగుతున్నాయి. పలుచోట్ల కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక కొంతమంది అన్నా హజారే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సోదరుడా అని ప్రశ్నిస్తున్నారట.వారు అలాగే భావిస్తున్నారు కూడా రాజస్తాన్ లోని కోట ప్రాంతంలో దీనిపై కొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ అన్నా హజారే అచ్చం లాల్ బహదూర్ శాస్త్రి సోదరుడులా ఉన్నారని అంటే, కొందరు మహాత్మా గాంధీ బంధువులా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.బుండి జిల్లాలోని హత్తిపూర గ్రామానికి చెందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కారుడు బద్రిలాల్ గుర్జార్ మాట్లాడుతూ అన్నా హజారే శాస్త్రి సోదరుడు మాదిరే ఉన్నారని అన్నారు. అలాగే కోటలోని టీచర్స్ కాలనీలో నివసించే శర్మ అనే అరవైఐదేళ్ల వయసు కల రాంప్యారీ శర్మ మాట్లాడుతూ శాస్త్రీజీని తాను వ్యక్తిగతంగా చూశానని, అన్నా హజారే కచ్చితంగా లాల్ బహదూర్ శాస్త్రి మాదిరే కనిపిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద దేశంలోని నగరాలు,పట్టణాలలోనే కాకుండా గ్రామాలలో కూడా అన్నా హజారే ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమ చిహ్నం గా కనిపిస్తూ, ఆయనలో ఒక గాంధీజీని, ఒక లాల్ బహదూర్ శాస్త్రిని చూసుకుంటున్నారు.

కామెంట్‌లు

  1. పుట్టిన రోజు పార్టీ కోసం రెండు లక్షలు ఖర్చు పెట్టిన అన్నా హజారేకి శాస్త్రి గారితో పోలికేమిటి? లాల్ బహాదుర్ శాస్త్రి గారు నిరాడంబరంగా బతికారు. ఆయన ఎన్నడూ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడలేదు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!