తిరిగివస్తారా.. సిద్దమవుతారా..?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని సిబిఐ దోషిగా నిలబెట్టినందుకు నిరసనగా వైఎస్ జగన్‌కి సపోర్ట్‌గా ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసిన వారికి కాంగ్రెస్ వర్గాలు ఓ ఆఫర్ ముందుంచింది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పునరాలోచించుకుని తమ రాజీనామాలని వెనక్కితీసుకోవాలని, అలా చేస్తే వారిపై అనర్హత వేటుని వేయబోమని ప్రకటించారు. ఈ ఆఫర్‌ని తిరస్కరిస్తే ఉప ఎన్నికలకు సిద్దం కావాలని కూడా హెచ్చరించారు. జగన్‌ని సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కోరినట్లుగా ఎమ్మెల్యే పదవులలో తిరిగి కొనసాగుతారా..? లేదంటే జగన్‌నే నమ్ముకుని రాజీనామాలనే కోరుకుంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అవినీతి ఆరోపణఫలతో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఏ క్షణంలోనైనా జైలుకి వెళ్తారనే ఊహాగానాలు ఊపందుకోవటంతో, గజన్‌కి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏం చేయబోతారన్నది ఆసక్తికరంగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి