హ‌జారే అరెస్టు.. బాబు పాద‌యాత్ర‌..


ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే అరెస్టును తెలుగుదేశం పార్టీ ఖండించింది. అన్నా అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం కార్యాలయం ఎన్.టి.ఆర్. ట్రస్టు భవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు పాదయాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. టాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది.తొలుత టాంక్ బండ్ పై దీక్ష చేయాలని భావించినా, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్ర ఆరంభించారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆయన ధర్నాకు దిగుతారు.అయితే చంద్రబాబును మధ్యలోనే పోలీసులు అరెస్టు చేయవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు అన్నాహజారే కి మద్దతుగా నిరసన ర్యాలీలు తీస్తున్నారు. కాగా అన్నా హజారే అరెస్టును ఎమ్.పిలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాధోడ్ లు ఖండించారు. కాగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేకి కేంద్రం ఇచ్చిన బహుమతి ఇది అని వారు వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!