పా‌ర్ల‌మెంటు సాక్షిగా రాజీనామా..


పార్లమెంటు సబ్యుడిగా ఇదే నాకు అఖరు సెషన్ అని గతంలోనే చెప్పానని, పార్లమెంటులో రాజీనామా చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని, అది కుదిరితే అలా చేస్తానని అనకాపల్లి ఎమ్.పి సబ్బం హరి అన్నారు. అలాకాకపోతే మామూలు ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని సబ్బం హరి అన్నారు. వ్యక్తిగత కక్షలతో రాజశేఖరరెడ్డి ఇమేజీని డామేజీ చేస్తున్నారన్నది తమ అభిప్రాయం అని హరి స్పష్టం చేశారు. జగన్ ఏ రోజు అయితే కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చారో, అప్పటి నుంచి జరిగిన ప్రతి దీక్షలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలంతా జగన్ తో ఉన్నారంటే, ఆయన పట్ల వారికున్న విశ్వాసానికి నిదర్శనమని హరి తెలిపారు. జగన్ రాజీనామా చేయడానికి కారణం వేరని, తన కారణం వేరని అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అంగీకరించకపోతే జగన్ రాజీనామా చేశారని ఆయన అన్నారు. చాలా మంది మంత్రులు ఆ రోజు ఒక మాట చెప్పారని, ఎఐసిసి డైరెక్షన్ ఇచ్చిందని, వైఎస్.కోసం మరణించినవారికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారని చెప్పారని ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలలో ఒకే సిద్దాంతం తో ప్రతిసారి ఉండరని, అవకాశవాదం, పరిస్థితులు కూడా కారణం అవుతాయని అన్నారు. ఇదే వ్యక్తులు రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు ఏమి చెప్పారో, ఆ తర్వాత ఏమి మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.తనతోపాటు మరో ఎమ్.పి కూడా రాజీనామా చేయవచ్చని, ఆయన మరో వారం ఆగమన్నారని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!