త‌ప్పు ఇద్దరిదా..?


వై.ఎస్.ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును కూడా సిబిఐ చేర్చడం ఆసక్తికరంగా ఉంది.రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్ కొందరు పెట్టుబడిదారులతో కలిసి నేరపూరిత కుట్ర చేశారని సిబిఐ తన ఎప్.ఐ.ఆర్. లో పేర్కొంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా కొందరు పెట్టుబడి దారులకు లబ్ది చేకూర్చి , దానికి ప్రతిఫలంగా తన కొడుకు ఏర్పాటు చేసిన సంస్థలలో అధిక ప్రీమియంలకు పెట్టుబడులు పెట్టించారని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేశారని సిబిఐ ఆరోపించింది.వీటికి ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు కూడా భావించిందని సిబిఐ తెలిపింది.నీటిపారుదల ప్రాజెక్టులు,సెజ్ లు తదితర కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఈ ఆపరేషన్ జరిగిందని సిబిఐ ఆరోపించింది. కాగా శంకరరావులేఖ, టిడిపి ఆరోపణలలోని భాగాలనే సిబిఐ రాసిందని సాక్షి వ్యాఖ్యానించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!