3శాతం మందే రోజూ సెక్స్


సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి మార్కెట్ లో కొత్త ప్రాడక్ట్స్ వస్తూనే ఉన్నా, సెక్స్ డ్రైవ్ తగ్గిపోతూనే ఉంది. ఈ మధ్యనే నిర్వహించిన ఓ సర్వేలో సెక్స్ ఎటెంప్ట్స్ పై కొత్త కోణాలు వెలుగుచూశాయి.  సెక్స్ సామర్థ్యం పెంచడానికి మార్కెట్ లో ఒక పక్క అనేక ప్రాడెక్ట్స్ కుప్పతెప్పలుగా వస్తుంటే, మరో పక్క రోజూ సెక్స్ లో పాల్గొనే వారి శాతం దారుణంగా పడిపోతున్నది. అడల్ట్స్ ప్రాడెక్ట్స్ ను తయారుచేసే ఓ కంపెనీ ఈ మధ్యనే సర్వే నిర్వహిస్తే, దంపతుల మధ్య సెక్స్ విషయంలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. కేవలం మూడు శాతం మంది మాత్రమే రోజూ సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారట. దాదాపు 20 శాతం మంది అసలు తాము సెక్స్ లో చురుగ్గా పాల్గొనడంలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఈ ఆసక్తికరమైన విషయాలను సేకరించడంకోసం వెయ్యిమంది పురుషుల్నీ, మహిళలను ప్రశ్నించారు. వీరిలో ఐదు శాతం మంది ఇంతవరకు సెక్స్ ఆనందం రుచిచూడలేదని చెప్పారు. మిగతా వారిలో కూడా ఎక్కువమంది వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నట్టు ఒప్పుకున్నారు. 16శాతం మంది వారానికి నాలుగుసార్లు సెక్స్ ఎంజాయి చేస్తున్నట్టు చెప్పారు. 15 శాతం మంది మాత్రం నెలకు ఒకసారో, రెండుసార్లో సెక్స్ లో పాల్గొంటున్నట్టు అంగీకరించారు. ఏడు శాతం మంది సెక్స్ ఎంజాయి చేయాలంటే కొన్ని నెలలు ఆగాల్సి వస్తున్నదని ఒప్పుకున్నారు. రోజూ ఒక్కసారికంటే ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొనేవారు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నారని సర్వే తేల్చిచెప్పింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!