అలుపెరుగ‌ని అన్నా..


అన్నా హజారే.. వేసుకున్నవి ఖద్దరు బట్టలు.. ఎప్పటికీ ద్యానముద్రలో కూర్చున్నట్లే కనిపించే ఆ తీరు.. సత్యాగ్రహం అంటూ గాంధీని తలపించే అహార్యం.. లక్షలాది మద్దతుదారులు.. ఇవన్నీ అన్నా హజారేను చూస్తే ఎవరికైనా ఇంతే అనిపిస్తుంది. ఇప్పుడాయన వయస్సు 74 యేళ్లు. ఈ వయస్సులో అంతా అలాగే ఉంటారని అనుకుంటారు. కానీ ఈ వయస్సులో కూడా ఆయన అలసిపోలేదని నిరూపించారు. 74 యేళ్ల వయస్సులో కూడా తాను 24 యేళ్ల కుర్రాడినని నిరూపించారు. తిహార్ జైలు నుంచి బయటకు రాగానే.. నేరుగా అన్నా హజారే.. మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ సమయంలో అన్నాను చూసిన ప్రతీ ఒక్కరు తెల్లమొహం వేశారు. ఏకంగా పరుగులు పెట్టి మరీ.. అక్కడున్నవాళ్లందిరీని ఉరకలెత్తించారు. అన్నా రన్నింగ్ చూసి.. పోలీసులు హడలిపోయారు. ఈ యేజ్ లో కూడా ఇంత ఉషారుగా పరుగులు తీసిన అన్నాను చూసి.. అంతా ఆశ్చర్యపోయారు. అయినా.. అసలు అలిసిపోయే మాట అన్నాకు సరిపోదని చెప్పొచ్చు. ఇంత యేజ్ లో కూడా అవినీతికి వ్యతిరేకంగా.. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దేశమైన భారత ప్రజలను ఏకతాటిపై తెచ్చిన ధీశాలి అన్నా.. అనుకున్నది సాధించే వరకు విశ్రమించని శ్రామికుడు అన్నా.. మరి ఆయన బలమెంత..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!