చిరుకి మ‌రో ప‌రీక్ష పెట్ట‌నున్న కాంగ్రెస్‌


కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి మరో పరీక్ష పెడతారా? అందుకు రంగం సిద్దం అవుతోందా? కాంగ్రెస్ వర్గాల భావన ప్రకారం జగన్ కు మద్దతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన ఇరవైఆరు మంది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మొత్తం ప్రచార భారం అంతా మెగాస్టార్ చిరంజీవిపై పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన సత్తా తేల్చడానికి ఇది ఒక అవకాశంగా కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఉప ఎన్నికలు వస్తే చిరంజీవి కీలకం అవుతారని ప్రచారం కూడా ఆరంభించారు. దానికి కారణం ఏమిటంటే ఈ ఇరవై ఆరు నియోజకవర్గాలలో పందొమ్మిది నియోజకవర్గాలలో ప్రజారాజ్యం పార్టీకి ఇరవైవేలు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సాధారణ లెక్కల ప్రకారం చూస్తే, గత ఎన్నికలలో కాంగ్రెస్ కు, ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లను లెక్క వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆటోమాటిక్ గా గెలవాలి. రాజకీయాలలో ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుందన్న గ్యారంటీ ఉండదు. పైగా జగన్ కు సానుభూతి ఉంటే దాని ప్రభావం అధికంగా సహజంగానే పడుతుంది. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్ పోవడంతో ఆ పార్టీలు ఖంగు తిన్నాయి.ఇప్పుడు ఎవరు ఉప ఎన్నికలకు బాధ్యత వహించాలన్న చర్చ ఆరంభమవుతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు సహజంగా బాధ్యత వహించాలి. ప్రభుత్వంపై ప్రజలలోఉన్న అభిప్రాయంగా దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ముగ్గులో దింపితే ఎన్నికల పలిత ప్రభావం డైల్యూట్ అవుతుందన్నది కొందరి ఆలోచనగా ఉంది. చిరంజీవి పార్టీకి గతంలో టెక్కలి, నరసన్నపేట, పాయకరావుపేట, అనపర్తి, కాకినాడ, రామచంద్రాపురం, నరసాపురం, ఏలూరు, పోలవరం, ప్రత్తిపాడు, దర్శి, ఒంగోలు, కోవూరు, రాజంపేట, కోడూరు పాణ్యం, అనంతపురం మొదలైన చోట్ల గణనీయంగా ఓట్లు వచ్చాయి .అదే సమయంలో టెక్కలి ఉప ఎన్నిక సమయంలో ప్రజారాజ్యం ఓట్ల గణనీయంగా తగ్గిపోయాయి. కోస్తా జిల్లాలలో ఒక సామాజిక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న చిరంజీవి ద్వారా ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా విజయం సాధించాలన్నది కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచనగా ఉంది. ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి. ఉప ఎన్నికలలో గెలిస్తే దానిని అందరూ పంచుకోవచ్చు. అన్ని లేదా ఎక్కువ చోట్ల ఓడిపోయినా దానిని చిరంజీవిపై నెట్టవచ్చు. ప్రజారాజ్యం పార్టీని, ప్రజాభిమానం కలిగినట్లు భావించిన చిరంజీవి వల్ల కూడా ఫలితం దక్కలేదని అధిష్టానానికి చెప్పవచ్చన్నది వారి వ్యూహంగా ఉంది.చిరంజీని ఈ భారాన్ని మోయడానికి సిద్దంగా ఉంటారా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!