శంక‌ర‌రావు మ‌రో లేఖాస్త్రం


జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాలపై హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి శంకర్రావు.. ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ కు మరో లేఖను రాశారు. సంచలన వ్యాఖ్యలతో మంత్రి లేఖ రాశారు. అసలు వైఎస్ హయాంలో ఉన్న మంత్రులందరినీ విచారించా ల్సిందే అని శంకర్రావు లేఖలో పేర్కొన్నారు. అధికారులు, అనధికారులు, ముఖ్యులు, ప్రభుత్వ పెద్దలందరినీ విచారించాలని లేఖలో కోరారు. రిట్ పిటీషన్ లో లేని వాళ్లను కూడా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సాక్ష్యాలను నిందితులు తారుమారు చేసే అవకాశం ఉన్నందున.. ముందుగా వాళ్లందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకోవాలన్నారు. నిర్దిష్ట సమయంలోగా విచారణ పూర్తి చేయాలని మంత్రి శంకర్రావు లేఖలో కోరారు. అలాగే ప్రస్తుల క్యాబినేట్ లో 75 శాతం పైగా వైఎస్ హయాంలోని క్యాబినేట్ మంత్రులే ఉన్నారని.. వీళ్లను విచారిస్తే.. అసలు విషయాలు బయటపడతాయని లేఖలో చెప్పుకొచ్చారు. అప్పుడు మంత్రులుగా పనిచేసి.. ఇప్పుడు పదవులో లేనివాళ్లనూ.. వాళ్లనూ విచారించాలన్నారు. మరోవైపు మంత్రి శంకర్రావు లేఖపై.. మరో మంత్రి రఘువీరారెడ్డి స్పందించారు. శంకర్రావు వ్యాఖ్యలను స్వాగతించారు. వైఎస్ హయాంలో మంచి జరిగినా.. చెడు జరిగినా.. దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పుకొచ్చారు. వైఎస్ తీసుకున్న నిర్ణయాలకు.. ఆయన ఎంత బాధ్యుడో.. అప్పటి క్యాబినేట్ మంత్రులూ అంతే బాధ్యులని రఘువీరా చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!