నాగార్జున స‌క్సెస్ ఫార్ములా నాట్ వ‌ర్కింగ్‌..?


నాగార్జున కెరీర్‌ని మ‌నం ప‌రిశీల‌న‌గా గ‌మ‌నిస్తే.. ఆయ‌న స‌క్సెస్ అయిన చిత్రాల ద‌ర్శ‌కులు దాదాపుగా అంద‌రూ కొత్త‌వారే ఉంటారు. ఆయ‌న ఇంట్ర‌డ్యూస్ చేసిన ద‌ర్శ‌కులు త‌మ టాలెంట్‌తో నాగార్జున‌ని టాప్ రేంజ్‌లో నిల‌బెట్టారు. అయితే ఇప్పుడు ఇదే స‌క్సెస్ ఫార్ములాతో నాగార్జున నిండా చేతులు కాల్చుకుంటున్నాడ‌నిపిస్తోంది. తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాగార్జున..  కొత్త దర్శకుల ఎంపికలో మంచి ముందు చూపు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున సినిమాల ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, దశరథ్, లారెన్స్ మంచి దర్శకులుగా ఎదిగారు.
అయితే రానురాను నాగార్జునలో ముందు చూపు పవర్ తగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాదు త‌న కుమారుడు నాగ‌చైత‌న్య కెరీర్‌ని కూడా పాడుచేస్తున్న‌ట్ట‌నిపిస్తోంది.  తన గత సినిమా కేడి గమనించినా, తన తనయుడు నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్, దడ సినిమాలు పరాజయం పాలైన విషయం పరిశీలించినా ఈ విషయం స్పష్టం అవుతోంది. జోష్ సినిమాఃను వాసువర్మ, కేడి మూవీని కిరణ్, దడ చిత్రాన్ని అజయ్ భూయాన్ ప్రేక్షక రంజకంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. ఈ దర్శకులను ఎంపిక చేసింది నాగార్జునే. త‌న కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డ్డ ఈ స‌క్సెస్ ఫార్ములా త‌న కుమారుడి కెరీర్‌కి గుదిబండ‌లా మారుతుంద‌ని ఇప్ప‌టికైనా తెలిస్తే బావుంటుంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!