ఈడీ కేసులో అరెస్ట‌యితే..


వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టికే సిబిఐ సోదాలు మ‌మ్మురంగా సాగిస్తున్నాయి. జ‌గ‌న్‌, ఎమ్మార్‌లు చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు అంచ‌నాకి రావ‌డంతో ఇప్పుడు ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కూడా రంగంలోకి దిగింది.. అత్యంత కఠినమైన అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మంగళవారం జగన్, ఎమ్మార్‌లపై వేర్వేరు కేసులు నమోదు చేసింది. దీంతో జ‌గ‌న్ మ‌రింత చ‌క్ర‌బంధంలో ఇరుక్కున్న‌ట్టే.. ఈ కేసుల్లో అరెస్టయితే… బెయిలు దొరకడమూ కష్టమే! బ్యాంకు ఖాతాల స్తంభన, ఆస్తుల జప్తు… సరేసరి! 2జీ కుంభకోణం కేసులో పలు కంపెనీలకు చెందిన రూ.230 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు, బ్యాంకు ఖాతాల స్తంభనకు ఈడీ మంగళవారమే ఆదేశించింది. జగన్ కేసులోనూ ఇది జరగక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే… ఈ కేసులో పీఎంఎల్ఏ, ఫెమాల ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఇప్పటికే జరిపిన విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాకే… ఈడీకి కేంద్ర ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… ఆర్థిక నేరాల దర్యాప్తునకు సంబంధించిన అత్యున్నత సంస్థ. ఇది కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా సీబీఐ విచారణతోనే ముచ్చెమటలు కక్కుతున్నారు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో వీరికి మరిన్ని కష్టాలు తప్పవ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ కంపెనీల‌లో సిబిఐ సోదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ త‌న‌పై పెట్టిన కేసులు క‌క్ష‌సాధింపు చ‌ర్యే అని ద‌య్య‌బ‌డుతున్నారు. తాజాగా ఈడీ కేసులు కూడా నమోదు కావ‌డంతో జ‌గ‌న్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది. ఈడీ కేసులో జ‌గ‌న్ జైలుకి వెళ్ళ‌డం అనివార్య‌మేనా..?  ఒక‌వేళ జ‌గ‌న్ జైలుకెళ్ళాల్సి వ‌స్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతోంది..?  అని ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొని ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!