జ‌గ‌న్ వ‌ర్సెస్ చిరు


మెగాస్టార్ చిరంజీవి అప్పుడే కాంగ్రెస్ నాయకుడి పాత్రలోకి వెళ్లిపోయారు. జగన్ పై విమర్శలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.జగన్ పై రాజకీయ వేధింపులతోనే సిబిఐ విచారణ జరుగుతోందనడాన్ని చిరంజీవి ఖండిస్తూ, అది జగన్ రాజకీయ దిగజారుడుతనంగా వ్యాఖ్యానించారు. జగన్ పై ఎలాంటివిమర్శలు చేయాలా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్న తరుణంలో చిరంజీవి మాత్రం జగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించడం విశేషం.మరి కొద్ది రోజులలో అధికారికంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్న చిరంజీవి తన భవిష్యత్తు రాజకీయంలో జగన్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి అండగా నిలవబోతున్నారన్నమాట.వాస్తవాలు బయటకు వస్తాయనే జగన్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులో రాజకీయ వేధింపు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అందరు కృషి చేయాలని ఆయన హితవు చెప్పారు. అయితే లోక్ పాల్ పరిధిలోకి ప్రధాన మంత్రిని తీసుకు వచ్చే విషయంలో చర్చలు జరగాలని ఆయన అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నాయకుడి పాత్రలో చిరంజీవి ఎలా రాణిస్తారో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!