హరికృష్ణ నక్క పేరు?

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,రాజ్యసభ ఎంపీ అయిన నందమూరి హరికృష్ణ తన నమ్మకాలరీత్యా చాలాకాలంగా ఒక నక్కను పెంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని వెబ్‌సైట్‌లో చాలా క్రితమే ప్రచురించాం. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడైన హరికృష్ణ ఈ నక్కను పెంచుకోవడంలో కొన్ని నమ్మకాలున్నాయి. ఓ జ్యోతిష్యుడు ఇచ్చిన సలహామేరకే ఆయన ఈ పని చేస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన ఇంటికి అతిథులు వెళ్తే నక్క పేరును పరిచయం చేస్తున్నారట. ఏమని పరిచయం చేస్తున్నారో ఒక్కసారి ఊహించండి?
ఇటీవల తెలుగుదేశం పార్టీలో వారసత్వపోరు మొదలయ్యాక తన బావ చంద్రబాబును సైతం ఎదురించడానికి హరికృష్ణ సిద్ధపడ్డారు. కృష్ణాజిల్లాలో జరిగిన చిన్న వివాదం ఆధారంగా దాన్ని పెద్ద రచ్చ చేయాలనుకున్నారు. తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిలషిస్తున్నారు. ఆ గొడవల్లో కాస్త తగ్గినప్పటికీ స్వభావరీత్యా ఆయనకు చంద్రబాబు తీరు అంత నచ్చడం లేదు. అందుకేనో..మరే కారణమో తెలియదు కానీ ఆ నక్కను పరిచయం చేస్తూ చంద్రబాబూ అని పిలుస్తున్నారట. వెళ్లిన అతిథిలకు ఒకింత ఆశ్చర్యంగానూ, హాస్యంగానూ ఆ సన్నివేశం కన్పిస్తోందట. వారు బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం పదిమందికి చెప్పి నవ్వుకుంటున్నారు. ఎంత చంద్రబాబు మీద కోపం ఉంటే మాత్రం మరీ అంతగా బయట పడిపోవాలా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబును ఎదిరించి కొంతకాలం తెలుగుదేశానికి దూరమై మళ్లీ పార్టీలో చేరి,రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన హరికృష్ణకు చంద్రబాబుపై అంతకోపమెందుకోనని చర్చించుకుంటున్నారు.
source:kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!