రోశయ్య లేఖ కలకలం..


మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆ లేఖలోని విషయాలను ప్రత్యేకంగా మీడియా సమావేశంలో వివరించారు. సాధారణంగా పార్టీ విషయాలు బహిరంగ చర్చించనని చెప్పే రోశయ్య మీడియాతో దీనిపై మాట్లాడడం ఆసక్తిదాయకం. వై.ఎస్.జగన్ పార్టీని వీడడం వల్ల కాంగ్రెస్ తాత్కాలికంగా బలహీనపడిందని, అయితే గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని, అయితే తర్వాత స్థిరపడిందని రోశయ్య గుర్తు చేశారు. అయితే కడప ఉప ఎన్నికలో అంత ఘోరంగా ఓడిపోవడంపై సమీక్ష జరుపుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో తెలుసుకుని సర్దుబాటు చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పుతో పార్టీ బలప డదని ఆయన వ్యాఖ్యానించారు. రోశయ్య తనను మార్చడం గురించి అంటున్నారో, లేక కిరణ్ కుమార్ రెడ్డి గురించి అంటున్నారో అర్ధం కాకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఒకపక్క కాంగ్రెస్ బలహీనంగా ఉందంటున్నారు, మరో పక్క సి.ఎమ్.ను మార్చవద్దంటున్నారు. మా.జీ ముఖ్యమంత్రి రోశయ్య తన మనసులో మాటను పూర్తిగా బయటపెట్టారా? కొంత మాత్రమే బయటపెట్టారా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!