నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు

తనయుడు లోకేష్ ని ఇక పూర్తీ స్తాయిలో రాజకీయాల్లోకి దించాలని టీడీపీ అధినేత చంద్ర బాబు  వ్యూహాత్మకం గా పావులు కదుపుతున్నారు.తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టడం కోసం నందమూరి హరికృష్ణ మరో పక్క ప్రయత్నాలు చేస్తోన్న నేపధ్యం లోనే చంద్ర బాబు  దశల వారీ గా  తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.2009 ఎన్నికల నాటి నుంచి లోకేష్ తండ్రి కి అండగా వుంటున్నారు .కుప్పం లో ప్రచార బాధ్యతలను స్వీకరించి బాబు మెజారిటీ పెంచేందుకు లోకేష్ కృషి చేసారు .ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లకు హామీ ఇచ్చిన నగదు బదిలీ పధకం లోకేష్ దే అని బాబు అప్పట్లో గర్వం గా చెప్పుకున్నారు.ప్రస్తుతం పార్టీలో ప్రచార నిర్వహణ, మీడియా మేనేజెమెంట్  బాధ్యతలను అనధికారికం గా లోకేష్ చూస్తున్నారు .మరో పక్క స్టూడియోఎన్ చానల్ నిర్వహణ బాధ్యతలను కూడా లోకేష్ చూస్తున్నారు .కాగా2014 లో జరగ బోయే ఎన్నికలను  దృష్టిలో వుంచుకొని పార్టీ  పగ్గాలు మెల్లగాలోకేష్ కి అప్పగించనున్నారని తెలుస్తోంది.ఇందులో భాగం గానే  ఇప్పటికే లోకేష్ కి చంద్రగిరి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించాలని చంద్రగిరి మండల టీడీపీ సమావేశం లో తీర్మానించారు .ఈ తీర్మానాన్ని మంగళ వారం జరగనున్న  చిత్తూరు జిల్లాటీడీపీ  సమావేశం లోఆమోదించనున్నారు .ఈనెల 27 నుంచి జరగనున్న మహానాడు లోఆ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.అలా లాంచనం గా లోకేష్ ని అధికారికం గా రాజకీయాల్లోకి దించ బోతున్నారు.కాగా ఇది తెలిసి నందమూరి హరికృష్ణ కూడా తన అనుచరులతో జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పదవి ఇవ్వాలనే ప్రతి పాదనను మహానాడు లో తెర పైకి తేనున్నట్టు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!