డేరింగ్ డాషింగ్ హీరో.. (పార్ట్ -2)


సూప‌ర్‌స్టార్‌, న‌ట‌శేఖ‌ర కృష్ణ‌… మూడు శ‌త‌కాల చిత్రాల‌లో న‌టించినా ఇంకా న‌ట‌న మీద ఆయ‌న‌కు ప్రేమ పోలేదు. అందుకే అడ‌పా ద‌డ‌పా కొన్ని చిత్రాల్లో ఇప్ప‌టికీ న‌టిస్తూనే ఉంటారు. కృష్ణ న‌ట‌జీవితం ఎలా సాగిందంటే..
కెరీర్ మొద‌ట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ‘తేనెమనసులు’ (1964) చిత్రంలో కథానాయకుల్లో ఒకరిగా నటించి ప్రేక్షకులకు బాగా తెలిశారు.
ఆయ‌న న‌టించిన రెండ‌వ చిత్రం క‌న్నెమ‌న‌సులు.. అప్ప‌ట్లో ఇంగ్లీష్‌లో వ‌చ్చే జేమ్స్‌బాండ్ చిత్రాలు కృష్ణ‌కి ఎంత‌గానో న‌చ్చేవి. అందుకే జేమ్స్‌బాండ్ క‌థాంశంతో కూడిన చిత్రాల్లో ఆయ‌న గూఢ‌చారిగా త‌న మూడ‌వ చిత్రం  ‘గూఢచారి 116 లో న‌టించి తెలుగు చిత్రాల‌ని ఓ మ‌లుపు తిప్పిన ఘ‌న‌త కృష్ణ‌దే.. కుటుంబ క‌థా చిత్రాల‌లో క‌నిపించే హీరో పాత్ర‌లే ఎక్కువ‌గా ఉండేవి. జేమ్స్‌బాండ్ పాత్ర‌తో స‌రికొత్త హీరోయిజాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు.

ఆ త‌ర్వాత‌ పూర్తి గ్రామీణ వాతావరణంలో ‘సాక్షి’ చిత్రం తయారైనా కొత్తదనాన్ని కోరుకొనే ప్రేక్షకులను ఆ సినిమా ఎంతో నచ్చింది.
నిజజీవితంలో కృష్ణ వ్యక్తిత్వం, మంచితనం, నిజాయితీ, నిబద్దత, అమాయకత్వం.. ఆయన పోషించే పాత్రల్లో కూడా ప్రతిఫలించడం వల్ల ‘అమాయకుడు’, ‘అత్తగారు కొత్త కోడలు’, ‘లక్ష్మీనివాసం’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’, ‘చెల్లెలి కోసం’, ‘వింత కాపురం’ వంటి కుటుంబ కథాచిత్రాల్లో కృష్ణ నటన ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.
ఒక్క పక్క కుటుంబకథాచిత్రాలు, మరో పక్క క్రైమ్, యాక్షన్ సినిమాలు చేస్తూ రెండు రకాలుగా తన అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ క్రమంగా తన స్థాయిని పెంచుకొని అగ్రకథానాయకునిగా ఎదిగారు కృష్ణ. అవకాశాలు లెక్కకు మంచి వస్తుండటంతో అప్పట్లో రోజుకి మూడు, నాలుగు షిఫ్టులు పనిచేసేవారు కృష్ణ. నిర్మాతలు కూడా అంతే వేగంగా షెడ్యూల్స్ తయారు చేసేవారు.
సిహెచ్‌. సంతోష్‌కృష్ణ‌
email:santoshkrishnach@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!