రుతుపవనాలు లేటేనా?

ఎండలు మండిపోతున్నాయి. భూగర్భజలం అడుగంటిపోతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే పలుచోట్ల నీటి ఎద్దడి ఎక్కువైంది. దీంతో వానలు ఎప్పుడు పడతాయా…జలాశయాలు ఎప్పుడు నిండుతాయా… అని ఊరూవాడా వేయికళ్లతో  ఎదురుచూస్తున్నారు. దండిగా వానలు పడాలంటే నైరుతీ రుతుపవనాల్లో చురుకుదనం రావాలి. సకాలంలోనే ఈఏడాది నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం అధికారులు చెప్పినా, ప్రస్తుతానికి ఆ అవకాశాలు కనబడటంలేదు.  ఎందుకంటే, సాధారణంగా మే 20 నాటికి అండమాన్ కు నైరుతీ రుతుపవనాలు తాకుతాయి. అయితే, ఈ ఏడాది అలా  జరగలేదు. దీంతో జూన్ 4 నాటికి మన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించకపోవచ్చు. అంటే, మరికొంతకాలం ఎండలు తప్పవన్నమాట.
-వాసు (హైదరాబాద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!