డేరింగ్ డాషింగ్ హీరో.. (పార్ట్ -1)


సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్న హీరో. తెలుగు సినిమా రంగంలో ఎన్నో సాహ‌సాలు చేసిన న‌టుడు. మొద‌టి స్కోప్ సినిమా, మొద‌టి 70 ఎం.ఎం. సినిమాల‌ని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేసిన న‌టుడు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. 300 పై చిలుకు చిత్రాల్లో హీరోగా న‌టించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఎంత ఎదిగినా ఒదిగిన‌ట్టుండాల‌నే నానుడి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కి స‌రిగ్గా స‌రిపోతుంది. విజ‌యాలు వ‌చ్చిన‌పుడు పొంగిపోవ‌డం, అప‌జ‌యాలు ఎదుర‌యిన‌పుడు కృంగిపోవ‌డం అన్న‌ది ఆయ‌న‌లో ఉండ‌దు. ప‌రిస్థితులు ఎలా ఉన్నా ఆయ‌న మాత్రం ఎంతో మామూలుగా ఉంటాడు. నంద‌మూరి తార‌క రామారావు స్టార్‌గా వెలుగొందుతున్న కాలంలో ఆయ‌న‌కి పోటీగా కృష్ణ న‌టించిన ఎన్నో చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. అంతేకాదు టెక్నిక‌ల్‌గా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌కి కూడా కృష్ణ కృషి చేసారు. ప‌ద్మాలయా స్టూడియో స్థాపించి స్టూడియో అధినేత‌గానూ, నిర్మాత‌గానూ ఆయన ఎన్నో విజ‌యాల‌ని చ‌విచూశాడు. హీరోగా రిటైర్‌మెంట్ అయిఆ ఆయ‌న‌కి ఇప్ప‌టికీ ల‌క్ష‌లాది మంది అభిమానులున్నారు. ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని అందుకున్నఆయ‌న చిన్న కుమారుడు మ‌హేష్‌బాబు కూడా ఇప్పుడు స్టార్‌గా వెలుగొందుతున్నాడు. నేడు సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు.. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 5amnews.com హార్ధిక శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!