కాంగ్రెసును గెలిపించి తీరాల్సిందే : సీఎం సీరియస్

|
కడప, పులివెందుల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని తీరాల్సిందేనని సీఎం మంత్రులను ఆదేశించారు. ఈ ఎన్నికలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని,కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తమ వంతు ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. నేను కూడా ప్రచారానికి వస్తున్నాను మీరు కూడా బాధ్యతలు అప్పగించిన వారంతా తక్షణమే కడపకు పోవాల్సిందిగా సీఎం మంత్రులను ఆదేశించారు. ఎలక్షన్స్ ను నేనే కాదు కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుందని, ఎంతకు తెగించైనా మన అభ్యర్థులను గెలిపించుకొని తీరాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి మరో కారణం కూడా ఉందని కొందరు గుసగుసలాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాకముందు వైఎస్ జగన్ కు ఆంధ్రాలో ఏమీ లేదని, నాకు సీఎం పోస్టు ఇస్తే అన్నీ క్లియర్ చేస్తానని హైకమాండ్ పెద్దల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఇప్పుడు గానీ ఓడిపోతే వారిదగ్గర తన పరపతి తగ్గుతుందని సీఎం భయపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో జగన్ వర్గం చేతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ పరంగా కొంత ఇబ్బంది తలెత్తింది అందువల్ల జగన్ బూచి తోనే సీఎం పదవి పొందిన కిరణ్ ఈ ఎన్నికల్లో ఓడితే హైకమాండ్ తో ఇబ్బందులు వస్తాయని మంత్రులతో ఇలా చెప్పారని, అంతేకాకుండా అభ్యర్థులను కూడా బలమైన వారిని పెట్టేందుకు ప్రయత్నించారని విశ్వసనీయసమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!