సత్యసాయి ఆస్తి విలువెంత?

|

వర్తమాన సమాజంలో అద్బుతాలు సృష్టించగలిగిన వ్యక్తిగా పేరుగాంచిన సత్యసాయిబాబా కోట్లాదిమంది భక్తులను సంపాదించుకున్నారు. తత్వం, వేదాంత బోధన, జీవనసారాన్ని ప్రజలకు అందిస్తూ తనదైన శైలిలో కోట్లాదిమంది ప్రజలను ప్రభావితులను చేసిన ఘనత సాయిబాబాకు దక్కుతుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగారు? ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎలా వచ్చారు మొదలైన అంశాలపై అనేకాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ రాష్ట్రపతి, ప్రధాని అనేకరాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదలు సామాన్యుల వరకు ఆకట్టుకోగలిగిన శక్తి సాయిబాబాకు ఉండడం విశేషం. ఆయన శూన్యం నుంచి విభూతిని తీస్తారు..కొన్నిసార్లు బంగారు ఆభరణాలు తీసి భక్తులకు బహుకరిస్తారు ఇలా ఎన్నో విశేషాలతో ప్రపంచవ్యాప్తంగా భక్తులని కూడగట్టుకొని అనంతపురం జిల్లాలో మారుమూలనున్న పుట్టపర్తికి అపారమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఘనత, అలాగే కోట్లాదిరుపాయల నిధులతో సేవాకార్యక్రమాలు చేపట్టిన ఖ్యాతి కూడా ఆయనకుంది. ఒక దశలో ప్రభుత్వాలే ఆయన వెంట పడి రక్షిత నీటిపథకాలు , ఆస్పత్రులు వంటివి చేపట్టాల్సిందిగా కోరాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇవన్నీ భక్తులు ఇచ్చే విరాళాలే ప్రధానమైన ఆదాయవనరు. మరి ఇవన్నీ చేయాలంటే సాయిబాబాకు ఎంతమొత్తంలో విరాశాలు వస్తున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనిపై రకరకాల కథనాలు ఉన్నాయి. సాయికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్లమంది భక్తులుంటారని అంచనా. ఇందులో విదేశీ భక్తులు కూడా గణనీయంగానే ఉన్నారు. వారిచ్చే డబ్బు డాలర్ల రూపంలో వస్తుంది. ప్రతిఏటా సుమారు 65కోట్లరుపాయలు వరకు విరాళాలు వస్తుండేవని కొందరు అంచనా వేశారు. అయితే మొత్తంమీద ఇప్పటికి సాయిబాబా ట్రస్ట్‌కి ఉన్న ఆస్తుల విలువ ఎంతనేదిదానిని తెలుసుకోవడం ఆసక్తికరం. సాయిబాబాకు బెంగుళూరు, హైదరాబాద్,చెన్నై లతో పాటు దేశంలోని అనేక నగరాలు, సుమారు యాభై దేశాల్లో ఆస్తులుంటాయని చెప్తున్నారు. వాటి విలువలు క్రమేపీ పెరుగుతూ ఇప్పటికి అవి ఎనబైవేల కోట్లకు చేరుకుని ఉంటుందని ఓ ఆదాయపన్ను శాఖాధికారి ఒకరు అనధికారంగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆస్తులన్నింటి విలువ కలిపి ఇంత ఉంటుందా అన్న సందేహం కూడా లేకపోలేదు. కొంతమంది బాబా అంటే గిట్టనివారు ఇలాంటి ప్రచారం చేస్తుంటారనే అభిప్రాయం కూడా ఉంది. బాబా ఆస్తులకు సంబంధించి, ట్రస్ట్‌కు వచ్చే విరాళాలపైన ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేసిన వారు ఉన్నారు. ఫిర్యాదులు వివాదాలు సంగతి పక్కన పెడితే సత్యసాయిబాబా ట్రస్ట్‌కు ఉన్న ఆస్తుల విలువ వేలకోట్లలో ఉన్నదన్న సంగతి అంగీకరించాల్సిందే..
(source:www.kommineni.info)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!