మీడియాలో ఇంటర్ నెట్ పాత్ర : అంతర్జాల సదస్సులో తుర్లపాటి

 ఇంటర్ నెట్ వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. వెబ్ పత్రికలు, బ్లాగ్ ల్లో తెలుగుతనం  కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మీడియాలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తిరీత్యా అవసరాలు తీర్చడంలో అంతర్జాలం (ఇంటర్ నెట్) బాగా ఉపయోగపడుతున్నది.
 అంటే, వెబ్ సైట్లు, బ్లాగ్ లు సైతం ఇటీవల కాలంలో మీడియా పాత్ర పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ రకంగా చూస్తే మొత్తం మీడియాను మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు.
1. ప్రింట్ మీడియా
2. ఎలక్ట్రానిక్ మీడియా (ఇందులో రేడియో, టివీలు ఉంటాయి)
3. వెబ్ మీడియా (ఇందులో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు ఉంటాయి)

 వెబ్ మీడియా వార్తలను, విశ్లేషణలను విరివిగా అందిస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తు ఇందులో పనిచేస్తున్న జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదు. ఈ పరిస్థితిలో మార్పురావాలి. రాష్ట్ర సమాచారశాఖ, సాంకేతిక పరిజ్ఞానశాఖ సౌజన్యంతో, సిలికాన్ ఆంధ్ర ఏర్పాటు చేసిన తెలుగు అంతర్జాల సదస్సు వేదికపై నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, వెబ్ మీడియా జర్నలిస్ట్ లను సైతం ప్రభుత్వం గుర్తించాలి. వారికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోని జర్నలిస్టులకు కల్పిస్తున్న కనీసపు సౌకర్యాలు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం నుంచి వెబ్ జర్నలిస్ట్ లకు ప్రోత్సాహం లభిస్తుంది. ఫలితంగా వెబ్ పత్రికల్లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుందన్నది నా నమ్మకం. అందుకు ప్రభుత్వం ముందుకు కదలాలన్నదే నా విజ్ఞప్తి.
 మీడియాలో అంతర్జాలం (ఇంటర్ నెట్ ) పాత్ర చాలా కీలకమైనది. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న నేను గమనించింది ఏమిటంటే, వార్తలను తయారుచేయడం, విశ్లేషణలు రూపొందించడంలో సమాచారసేకరణ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, మరీ ముఖ్యంగా టివీ మీడియా సిబ్బంది ఇంటర్నెట్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలుగులో లభిస్తున్న సమాచారాన్ని ఎవరికితోచిన విధంగా వారు ఉపయోగించుకుంటున్నారన్నది సత్యం. ఇది ఇంకా పెరగాలి. ఫాంట్స్ లో సౌలభ్యం వంటి వాటిపై సాంకేతిక నిపుణులు దృష్టిపెట్టాలి. అలాగే, తెలుగు పదకోశాన్ని మరింత సమగ్రంగా తయారుచేయాలి.
                         - తుర్లపాటి నాగభూషణ రావు
TV5, హైదరాబాద్, 98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!