ఇంతకీ సాయిబాబా పరిస్థితి ఏంటి?




|
ఆధ్యాత్మిక ప్రపంచానికి రారాజుగా వెలుగొందిన పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆరోగ్యపరిస్థితిపై భిన్నకథనాలు ప్రచారంలోకి వస్తుండటంతో భక్తులు ఆందోళనకు లోనవుతున్నారు. వైద్యులు విడుదల చేస్తున్న మెడికల్ బులెటెన్లు సైతం గందరగోళంగా ఉంటున్నాయి. ఓ పక్క కోలుకుంటున్నారని చెప్తూనే మరోపక్క అపాయం లేదని చెప్పజాలమని అంటున్నారు. ప్రపంచంలోని 130దేశాల్లో కోట్లాది మంది భక్తులతో పాటు సత్యసాయి ట్రస్ట్‌కు వేలకోట్ల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి . ఈ నేపథ్యంలో అనేకవదంతులు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా అసలు బాబా జీవించే ఉన్నారా? లేక పరమపధించారా అన్నదానిపై కూడా రకరకాల వార్తలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. పుట్టపర్తిలో బారీకేడ్ల నిర్మాణం, పూలసేకరణ వంటి కార్యక్రమాలు చూస్తే ఇక స్వామీవారు లేరని కలత చెందారు. అయితే స్వామి ఆరోగ్యం మెరుగుదల కోసం మృత్యుంజయ యాగం చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. కాగా సాయిబాబా వెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారని, వెంటిలేటర్ తీసిన పక్షంలో ఏ క్షణమైనా పరమపధించవచ్చునని , వైద్యపరిభాషలో చెప్పాలంటే ఆయన క్లినికల్లీ డెడ్‌గా చెప్పవచ్చునని కొందరు వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీనిర్థం కేవలం ఊపిరిమాత్రమే ఉంటుంది తప్ప మిగతా ఆవయవాలేవీ పనిచేయనట్లే. ఈ పరిస్థితుల్లో నిజంగా స్వామివారు బతికుంటే తాము చూడాల్సిందేనంటూ గత రాత్రి పెద్దసంఖ్యలో భక్తులు ఆస్పత్రి గేటు వద్ద రగడ సృష్టించారు. వారిని పోలీసులు చాలా కష్టపడి అదుపు చేయాల్సి వచ్చింది. బాబా ఇక లేరు అన్న వార్త వస్తే ఆయన భక్తులు కొంతమంది తీవ్రమైన ప్రభావానికి లోనుకావచ్చునని , అందువల్ల కాస్త జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నారని కొందరు చెప్తున్నారు. ఈలోగా ట్రస్ట్ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తీసుకురావడం, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడం, ఆ తరువాతే బాబాకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తారని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం మూఢం ఉందని, అందువల్ల కొంత వ్యవధి తీసుకొని ఏ సంగతీ చెప్పవచ్చునని కొందరి అభిప్రాయం. ఇప్పటికందుతున్న సమాచారాన్ని, డాక్టర్ల నివేదికల్నీ పరిగణనలోకి తీసుకుంటే సత్యసాయిబాబా పూర్తిగా కోలుకొని యథాప్రకారం భక్తులకు ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి వస్తే కనుక అది వైద్యశాస్త్రంలో అద్బుతంగానే పరిగణించవచ్చునని అంటున్నారు. ఏదేమైనప్పటికీ సత్యసాయి జీవించి ఉండాలని, ప్రజలకు మంచి సేవలందించాలని అందరం అకాంక్షిద్దాం.
- Source; kommineni.info

కామెంట్‌లు

  1. prajalu moorkulu,Saibaba is not a bhagavan. he is also a common man . Why should we feel about his health. Every days somay people are dying . See for example in japan How many people has dead. If the saibaba is bhagavan, he should have avoid this natural calamity...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!