బర్నింగ్ కామెంట్రీ - 9(హజారే నీ ప్రాణం బేజారే..)
విభీషణుడి జాడ కనుక్కో హజారే...
అవినీతి మహావృక్షంలా
అంబరాన్ని తాకుచున్నది
వూడలన్నీ నల్లత్రాచుల్లా
దేశవ్యాప్తంగా బుసలుకొడుతున్నవి
ఒక వూడని నరికిన మరుక్షణం
మరోఊడ..రావణుని తలల్లా
వికటాట్టహాసం చేయుచుండే..
మరి -
ఆ వృక్షం ప్రాణం ఎక్కడుందో చెప్పే
విభీషణుడి జాడ కనుక్కో హజారే...
లేని ఎడల నీ ప్రాణం బేజారే!!
- నీల్ కొలికపూడి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి