10, ఏప్రిల్ 2011, ఆదివారం

సాఫ్ట్వేర్ సత్తి - రన్ ఫర్ చిపో 1 (ఎపిసోడ్ 4)


ఆ రోజు ఆదివారం... ఓహ్.. సారి.. సోమవారం.. నేను ఆఫీసు లో చాలా సీరియస్ గా ఫేస్ బుక్ లో అప్ డేట్స
చేస్తున్నాను... ఎవరో నా డెస్క్ దగ్గరకి వస్తున్నట్టు అనిపించి.. ఫేస్ బుక్ విండో డౌన్ చేసి.. ఏదో కోడ్ కొడుతున్నట్టు బిల్డ్ అప్ స్టార్ట్ చేసాను.......
'హాయ్ సత్తి... ఏం చేస్తున్నావ్?' అడిగింది జో
జో - పూర్తి పేరు జ్యోత్స్న .. 'జో'' అ౦టే అ౦ద౦గా ఉందని అలా మార్చుకుంది... ఇది చాలా అ౦ద౦గా ఉంటుంది.... అని ఫీల్ అవుతుంది. అ౦దుకేనేమో.. దీనికి కెమెరా పిచ్చి కూడా చాలా ఎక్కువ. కెమెరా కనిపిస్తే చాలు పనులన్నీ పక్కన పెట్టి కెమెరా కి పోసు ఇచ్చేస్తుంది.. ఆఖరికి CCTV కెమెరా కి కుడా ఒక పోసు ఇచ్చి వెళ్తుంది.... దీని కి ఇంకో పిచ్చి కూడా ఉంది లెండి.. అదేమిటంటే.. దీనిలాగానే దీని కోడ్ కుడా అ౦ద౦గా ఉండాలనుకుంటుంది... అ౦దుకే కోడ్ రాసిన తర్వాత... దాని చుట్టూ కామెంట్స్ తో కొన్ని డిజైన్ లు గీస్తుంది.. మొన్నా మధ్య ముగ్గుల పోటీ ఉంటే.... సరదాగా దీని కోడ్ ఒక ప్రింట్ తీసి పంపాను.... వాళ్ళకేమర్థమయిందో కాని దీని కోడ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది!!....
'హలో జో.. ఆ... ఏమీ లేదు... వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నాను' అన్నాను
'జోక్స్ ఆపు సత్తి... నిజం చెప్పు?' అని అడిగింది
నిజం చెప్తే ఎవరూ నమ్మరు... ఏం చేస్తాం?!
'ఇప్పుడే ఒక రిక్వైర్ మెంట్ వచ్చింది... సాయంత్రం లోపు డిజైన్ సబ్మిట్ చేయమని మన KD గాడి ఆర్డర్... అందుకే చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నా'
'ఓహ్.... అవునా.. నెక్స్ట్ వీక్ 'రన్ ఫర్ చిపో' ఉంది ... నువ్వు వస్తున్నావు కదా ... ఆల్రెడీ నీ పేరు మేము నామినేట్ చేసేసాము లే....'
రన్ ఫర్ చిపో - 'చిపో ' అనేది మా కంపెనీ పేరు... ఇది చైనా వాడు పెట్టిన కంపెనీ లెండి...  వాడు ఏ ఉద్దేశం తో పేరు పెట్టాడో తెలియదు కానీ... నాకు మాత్రం... మా కంపెనీ బోర్డు ఎప్పుడు చూసినా 'ఛి పో' అన్నట్టే ఉంటుంది... ఇంక 'రన్ ఫర్ చిపో' అంటారా... ఇది మా వాడు లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాడు.. కంపెనీ ఉద్యోగుల్లో ఉత్సాహం పెంచడానికి ప్రతి ఏడాది 10 కిలో మీటర్ లు పరిగెట్టిస్తాడు... లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు 200  మంది రేస్ స్టార్ట్ చేసారు... రేస్ ఫినిష్ అయ్యేసరికి 150  మందే మిగిలారు... మిగిలిన వాళ్ళు రేస్ మా కంపెనీ గేటు దగ్గర స్టార్ట్ చేసి .... వేరే కంపెనీ గేటు దగ్గర ఎండ్ చేసారు... అలా రన్నింగ్ తో పాటే జంపింగ్ కూడా చేసారన్నమాట
'అమ్మో! రన్నింగ్ ఆ ..... నా వల్ల కాదు... నేను రాను...'
అక్కడ సీన్ కట్ చేస్తే .....
అంతా హడావిడి ... ఎక్కడ చూసినా 'రన్ ఫర్ చిపో' బోర్డు లు... నేను రాను బాబోయి అన్నా లాక్కొచ్చారు...
'హలో సత్తి... ఏంటి రెడీ నా ?' అని అడిగింది అప్పు
అప్పు - ఫుల్ నేమ్ అపర్ణ ... దీని బరువు 100  కిలో ల కి తక్కువ ఉండదని నా నమ్మకం. చూడ్డానికి కల్పనారాయ్ లాగా ఉన్నా... మా గ్యాంగ్ లో కొద్దో గొప్పో టాలెంటెడ్ పర్సన్ అంటే ఇదే ... వాళ్ళ స్కూల్ లో .. కాలేజీ లో ... ఎప్పుడూ ఇదే టాపర్ అంట.. ఇది బాగా పాడుతుంది కూడా... కాలేజీ లో దీనికేదో అవార్డు కూడా ఇచ్చారట... మామూలు గా టాపర్ లకు, టాపర్ లని చెప్పుకొనే వాళ్లకి మా గ్యాంగ్ లో చోటు ఉండదు... కానీ.. దీని వెయిట్ కి వెయిటేజ్ ఇచ్చి చేర్చుకున్నాం...
(ఈ అప్పు ఇక్కడ ఏం చేస్తుంది... కొంప తీసి ఇది కుడా పరిగెడుతుందా.... అడిగితే పోలా..)
'హాయ్ అప్పు నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్... ఏంటి పరిగెత్తేద్దామనే??'
'చంపుతా... ఏం నేను పరిగెత్తలేనా?'
'ఆ... అ౦టే వెయిట్ కొంచం ఎక్కువ కదా....'
'ఆ !! ఏమన్నావ్?'
'ఆ ఏం లేదు... ఇంకా ఇక్కడ ఎంత సేపు వెయిట్ చేయాలా అని.. రేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..?'
'తెలియదు సత్తి...'
అ౦తలో మా రూం మేట్ PK  గాడు వచ్చాడు... మామూలు గా కాదు ట్రాక్ సూట్ లో ప్రత్యక్షమయ్యాడు...
'ఎరా ఆ డ్రెస్ ఏ౦టి ... ఆ షూస్ ఏంటి..... చేతిలో వాటర్ బాటిల్ ఏంటి.....  నిజం గా పరిగెడదామనే..?'
'అ౦టే.... ఫస్ట్ వచ్చిన వాళ్లకి ఏదో ప్రైజ్ ఇస్తారంట కదా.. మరి ప్రైజ్ తీసుకు౦టూ ఫోటో లో పడేటప్పుడు మంచి డ్రెస్ ఉండాలి కదా...'
'అబ్బ చా నువ్వు ఫస్ట్ వస్తావ్ మరి!... ఫస్ట్ వచ్చేది మన B గోపాల్ గాడే....'
'అంత ఖచ్చిత౦గా ఎలా చెప్తున్నావ్... ఏమన్నా మ్యాచ్ ఫిక్సి౦గ్ జరిగిందా?' అని చాలా ఆ౦దోళనగా అడిగాడు PK
'లేదు... ఎకోర్డింగ్ టు విండ్ డైరెక్షన్ ... మన బక్క గోపాల్ గాడిని ఇక్కడ లాంచ్ చేస్తే.. పది నిముషాల్లో.. పది కిలోమీటర్ లు ఎగురుకు౦టూ వెళ్ళిపోతాడు....' అని నవ్వుతూ చెప్పాను..
'నువ్వు ఒక్క సారి అలా పక్కకి వస్తావా? నీకొక సీక్రేట్ చెప్పాలి..' అ౦టూ నా చెవిలో చెప్పాడు PK
ఏ౦టో ఆ సీక్రెట్ !!.. కొంపతీసి వీడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడా ఏంటి ??
- to be continued
-Rajesh Turlapati

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి