జగన్ -నైతిక ప్రశ్న



రాజకీయాలలో నైతికం, అనైతికం అన్నవాటి గురించి మాట్లాడుకోవడం ఈ రోజులలో విడ్డూరంగానే ఉంటుంది. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రస్తావించారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని పులివెందులలో పోటీలో ఉంచడం కాంగ్రెస్ పార్టీ చేసిన అనైతిక చర్య అని ఆయన విమర్శించారు. ఇది ఏ రకంగా అనైతికం అవుతుందో ఆయన వివరించారో లేదో తేలియదు. రాజకీయాలలో ఒకసారి విబేధాలు వస్తే, తండ్రి లేడు, తల్లి లేదు. అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరిపై ఎవరైనా పోటీచేస్తారు. ఇది ఇప్పటి సంగతి కాదు. 1952 , 1955లలోకృష్ణా జిల్లా తిరువూరులో తండ్రి, కొడుకులు చెరొక పార్టీ తరపున పోటీచేశారు.ఒకసారి ఒకరు, ఇంకోసారి మరొకరు గెలిచారు. అది వేరే విషయం. ఇలా చరిత్రలో కొన్ని ఘట్టాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి పులివెందులలో వదిన, మరిదిల మధ్య పోటీ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి డి.ఎల్ రవీంద్ర రెడ్డి ప్రచారంలో వై.ఎస్. బొమ్మ వాడుకోలేని
పరిస్థితిలో పడ్డారని కూడా జగన్ విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!