సాయిని ఐసియులో ఎన్నాళ్లు ఉంచాలో చెప్పలేం

సత్యసాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని సత్యసాయి స్పెషాలిటీస్ లో చికిత్సలను పర్యవేక్షిస్తున్న డాక్టర్ రవిరాజ్‌ చెప్పారుతాము చేస్తున్న చికిత్సల వల్ల స్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని , బాబాను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. బాబాకు డయాలిసిస్ కొనసాగుతోందని, పేస్ మేకర్ తో గుండె పనిచేస్తోందని, బాబా ఊపిరితిత్తులలో నిమోనియా ఉందని ఆయన వెల్లడించారు. అయితే స్వామిజి విజువల్స్ తీసుకోవడం మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఐసియు లో బాబాను ఎన్నాళ్లు ఉంచేది చెప్పలేమని, ఆయన తెలిపారు. బాబాకు సుగర్ కూడా ఉందన్నారు. సాయిబాబాను 36మంది డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, బాబా బిపి నార్మల్ గా ఉందని,మందులకు స్పందిస్తున్నారని, అయితే ప్రతిక్షణం బాబాను కనిపెట్టుకుని ఉండాలని అంటూ బాబాను రక్షించుకోవడానికి మానవప్రయత్నం అంతా చేస్తున్నామని రవిరాజ్ పేర్కొన్నారు. కాగా డాక్టర్లు చెప్పే మాటలను అంతా నమ్మాలని, ఎవరిని పడితే వారిని ఐసియు లోకి అనుమతించజాలమని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రమేష్ అన్నారు.
                                                                                                                              - kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!