రాష్ట్ర జాతకం ప్రకారం తెలంగాణ తథ్యం

రాజకీయ సమీకరణములతో ఈ భవిష్యవాణికి సంబంధం లేదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ జాతకాన్ని ఆధారం చేసుకుని చేసిన పరిశీలన మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ 
పుట్టినతేదీ-నవంబర్ 1, 1956, దుర్ముఖ, ఆశ్వయుజ, కృష్ణత్రయోదశి, హస్త 4 వ పాదం
కర్కాటకలగ్నం-కన్యారాశి.

...ఆంధ్రప్రదేశ్ జాతకరీత్యా ప్రస్తుతం ఏలినాటి శని దశ సాగుతున్నది. శ్రీ ఖరనామసంవత్సరం ఉగాది నుండి
మే 7 వ తేదీ వరకు ఏడవయింట గురువు సువర్ణమూర్తి
. ఆ తర్వాత సంవత్సరమంతా ఎనిమిదవ యింట తామ్రమూర్తి. శని ఉగాది నుండి నవంబర్ 15 వరకు ఒకటవ యింట లోహమూర్తి. తదుపరి రెండవ యింట తామ్రమూర్తి. ఉగాది నుండి జూన్ 6 వరకు రాహువు నాల్గవ యింట, కేతువు పదవ యింట తామ్రమూర్తులు.తదుపరి సంవత్సరమంతా రాహువు మూడవ యింట, కేతువు తొమ్మిదవ యింట సువర్ణమూర్తులు. కాగా నవంబర్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ కు జన్మశని. మే 7 నుండి అష్టమగురుడు. అక్టోబర్ 31 నుండి వ్యయంలో కుజస్తంభన.
కన్యారాశికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4.
ఇదిలావుండగా ఏలినాటిశని వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరమంతా ఇక్కట్లు ఎదుర్కొనక తప్పదు. ముఖ్యంగా మే 7 తర్వాత పరిస్థితి మరింత దిగజారుతుంది. రాశిలో శనివక్రి కావడం వల్ల ప్రస్తుతం జూన్ 13 వరకూ ఒకింత ఊరట. ఆ పిదప మరిన్ని క్లేశములు తప్పవు.
ఆంధ్రప్రదేశ్ జాతకాన్ని అనుసరించి రాష్ట్రానికి ప్రస్తుతం అత్యంత క్లిష్టకాలం. ఆంధ్రప్రదేశ్ కు చతుర్థంలో ద్వితీయాధిపతి అయిన రవి నీచ. రాహుకేతవులూ నీచలోనే వున్నారు. తృతీయంలో మాంది, గుళికులు. నవాంశలో గురువు నీచ.
పంచమ, దశమ స్థానాలకు అధిపతి అయిన కుజుడు అష్టమంలో వున్నాడు. పరాక్రమస్థానంలో శుభులే వుండడం మూలాన ఇది soft state అయింది. కాగా రవి, గురువు, శని, రాహువు, కేతువు దీనులు. శని ఖలుడు. లజ్జితుడు కూడా.
వింశోత్తరి దశల్లో చూస్తే ప్రస్తుతం శని మహాదశ నడుస్తున్నది. శనిలో చంద్ర అంతర్దశ 2010 జూలై 21 నుండి ప్రారంభం అయింది.
జాతకంలో చంద్రుడు శత్రుక్షేత్రంలో శత్రువైన శుక్రునితో కూడివున్నాడు. కుజుని చేత వీక్షితుడు. మారకుడైన గురువుతో కలిసి వున్నాడు. పైగా కన్యాలగ్నానికి పాపి కూడా. అందువల్ల ప్రస్తుత కష్టాలు తప్పవు. శని ఈ జాతకంలో సప్తమ, అష్టమ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంచమంలో వున్నాడు. కాబట్టి క్లేశకారకుడు.
కుజుడే కారకుడు!...


ఇక శనిమహాదశలో కుజ అంతర్దశ 2012 ఫిబ్రవరి 17 నుండి ప్రారంభం అవుతుంది. ఇది మరింత కష్టకాలం. కుజుడు సోదరకారకుడు, భూకారకుడు అయినందు వల్ల ఆ అంతర్దశలో ఆంధ్ర, తెలంగాణప్రాంతాల మధ్య వైమనస్యాలు వుండగలవు. పైగా అష్టమకుజుడు కావడం వల్ల ఈ అంతర్దశలో రాజద్వేషం, భ్రాతృకలహం, మనఃక్లేశం, అపమృత్యుదోషము వుండే అవకాశం వుంది. అంతేకాక గోచారరీత్యా కుజుడు ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 30 వరకూ కర్కాటకరాశిలో సంచారం చేస్తాడు. ఆ సమయంలో తిరిగి ప్రాంతీయ విభేదాలు రాజుకునే అవకాశం వుంది. ఆ తర్వాత 2011 అక్టోబర్ 31 నుండి 2012 జూన్ 21 వరకూ కుజుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇది మొత్తం 234 రోజులు. అందులో 79 రోజుల పాటు వక్రంలో, స్తంభనలో వుంటాడు. ఇది చాలా కీలకమైన కాలం. వక్రకుజుడు భూమికి దగ్గరగానూ అందులోనూ ఉత్తరార్ధగోళసమీపంలోనూ వుండడం దృష్ట్యా అక్టోబర్ 31 నుండి మన దగ్గర అగ్నిసంబంధమైన ఉత్పాతాలు సంభవించే అవకాశం వున్నది. అలాగే కలహాలు, విధ్వంసం, హింస సంభవించే అవకాశాలు వున్నాయి. ఇంకోపక్కన శని అంతర్దశలో కుజఅంతర్దశ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నది. ఆంధ్రప్రదేశ్ కు 2013 మార్చి 27 నుండి శని మహాదశలో రాహు(నీచ)అంతర్దశ వుంటుంది. ఇది కూడా కష్టకాలమే. ఆ పిదప 2016 ఫిబ్రవరి 2 నుండి మారకుడైన గురువు అంతర్దశ. ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారనున్నాయి. 2011 సెప్టెంబర్ 9 నుండి తెలంగాణ ఉద్యమం పరాకాష్ఠదశకు చేరవచ్చు. జాతకరీత్యా 2012 జూన్ ఆఖరుకల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశాలు వున్నాయి. ఏలినాటిశనీ, శనిమహాదశ కలిసి నడవడం వల్ల ఆంధ్రప్రదేశ్ మనుగడ క్లిష్టంగా మారనుంది. 2009 చివరలో కుజుడు కర్కాటకంలో వుండి స్తంభించడం వల్ల తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఉవ్వెత్తున ఎగసింది. తిరిగి ఈ సారీ అదే పరిస్థితి పునరావృతం కావచ్చు.
- Yenna  Srinivasarao

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!