తెలుగు దేశంపార్టీ లో లుక లుకలు

తెలుగు దేశంపార్టీ లో లుక లుకలు మొదలైనాయి. నందమూరి వారసులకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని హరికృష్ణ అనుచరులు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ లో తీవ్ర స్థాయి విభేదాలకు కృష్ణా జిల్లా  వేదిక గామారింది . జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా చంద్రబాబు వర్గం కాగా అర్బన్ అధ్యక్షుడు వంశీ మోహన్ , గుడివాడ ఎమ్మెల్యే నానీ హరికృష్ణ వర్గం లో వున్నారు. ఇటీవల హరికృష్ణ జిల్లా పర్యటన కొచ్చినపుడు ఆయనకు సరైన గౌరవ మర్యాదలు లభించ లేదని, కార్యక్రమాల సమాచారాన్ని ఉమా ఇవ్వ లేదని    హరి వర్గీయుల ఆరోపణ . బాబు సన్నిహితుడు సుజన చౌదరి జిల్లాకు వస్తే హడావుడి చేసిన  ఉమా  హరికృష్ణ పట్ల అంతా ఆదరణ చూపలేదని వంశీ మోహన్, నానీలు ఆరోపిస్తున్నారు . చంద్ర బాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళగానే ఇక్కడ గొడవలు మొదలైనాయి . వంశీ, నానీ ఆరోపణలను హరి సమర్ధిస్తున్నట్టు గా తెలుస్తోంది.ఈ నేపధ్యం లోనే వంశీ,నానీ లు ప్రెస్ మీట్లు పెట్టి ఉమా ను తూర్పారా పట్టారు.అయితే ఉమా మాత్రం తనకు అందరి పట్ల గౌరవం వుందని మీడియాకు చెబుతున్నారు. ఈ క్రమం లోనే పార్టీ పదవులకు ఉమా ,వంశీ లు రాజీనామాలు చేసారు.బాబు వచ్చే లోగా మరే స్థాయికి ఈ విభేదాలు  ముదురు తాయో వేచి చూడాలి . కాగా చాలా కాలం గా  హరికృష్ణ కూడా బాబు వైఖరి పట్ల అసంతృప్తి తో వున్నారని తెలుస్తోంది. ఎన్టీఅర్ వారసులకు,అభిమానులకు ప్రాధాన్యత లేదనిహరి కినుక వహించినట్టు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!