తెలంగాణ కోసం మదుయాష్కీ కల్లోలం సృష్టించబోతున్నారా?



నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు మదుయాష్కీ    తాను రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తినన్న సంగతిని మర్చిపోతున్నారు. లేదంటే ఈ చేతకాని ప్రభుత్వాలు తనను ఏమి చేయలేవన్న ధీమాకావచ్చు. అప్పడప్పుడు ఈయన ఒక రెచ్చగొట్టే ప్రకటన చేయడం,తర్వాత తన సొంత పనికోసం ఏ అమెరికాకో వెళ్లిపోవడం, మళ్లీ వచ్చి మరో స్టేట్ మెంట్ ఇవ్వడం మామూలైందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. ఈయన తెలంగాణవాదాన్ని,అందులో ఈయనకు ఉన్న చిత్తశుద్దిని శంకించలేము కాని, కొన్ని ప్రకటనలు మాత్రం తీవ్ర అభ్యంతరంగా ఉంటాయి. తాజాగా చేసిన ప్రకటన ఏమిటంటే తెలంగాణ కోసం రాజీనామాలతోపాటు తెలంగాణలో కల్లోలం సృష్టించాలని సూచించారు. నిజానికి లోక్ సభ సభ్యుడిగా ఉన్న మదుయాష్కి కల్లోలం అన్న పదం వాడవచ్చా అన్న మీమాంస మనకే కాని, ఆయనకు ఏమాత్రం లేదు. తెలంగాణలో కల్లోలం సృష్టిస్తే ఎవరికి నష్టం తెలంగాణలోని సామన్య ప్రజలకే. రెక్కాడితే డొక్కాడని లక్షలమంది ప్రజలను ఈయన ఏ రకంగా ఆదుకుంటారో తెలియదు. ఈయన వరకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాని మామూలు మనుషుల పరిస్థితి అలాకాదు. అసలు ముందుగా మధు యాష్కిగాని, ఇతర కాంగ్రెస్ ఎమ్.పిలుకాని, ఎన్నిసార్లు రాజీనామా చేస్తాం , అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేశారు?ఎన్నిసార్లు రాజీనామాలు పరిష్కారం కాదు అని వాదించారు. ఇప్పుడేమో కల్లోలం సృష్టించాలని అంటున్నారు. మధు యాష్కి ముందుగా కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తే తెలంగాణ వచ్చే సంగతి తేలిపోతుంది.తెలంగాణలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో సహా రాజీనామా చేయమనండి,జనం ఏమి కల్లోలం సృష్టించనక్కర్లేదు. ఆటోమాటిక్ గా రాజకీయ కల్లోలం వచ్చి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.మరొక్కటి చేయవచ్చు. ఢిల్లీలో పార్లమెంటులో కొన్నాళ్లపాటు నిరసన తెలిపి దేశ దృష్టిని ఆకర్షించారు. ఆ పనేదో ఎ.ఐ.సి.సి ఆఫీస్ వద్ద కూడా తరచు చేయవచ్చు.అలాంటివేమీ చేయకుండా తెలంగాణ జనజీవితాన్ని కల్లోలం చేయమని సలహా ఇవ్వడంలో రాజకీయంగా వారు బాగుండాలి. జనం ఎలాపోయినా ఫర్వాలేదన్న దృష్టి మాత్రమే కనబడుతుంది.కనుక ముందుగా మధుయాష్కి కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తే మంచిదేమో...
Source: kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!