మరణం లేని జీవి (పార్ట్ 2)

  సముద్ర జలాల్లో తిరిగే ఒక రకం జెల్లీఫిష్ మరణాన్ని జయించిన మాట నిజమేఅయితే, మరి ఆ బయొలాజికల్ ఫార్ములాను మనం ఎందుకు ఉపయోగించుకులేకపోతున్నాం....?
  ఒక జెల్లీ ఫిష్ అమరత్వాన్ని సంపాదించుకుంటే, ఇంత తెలివితేటలు ఉన్న మనం  ఈ విషయంలో ఎందుకు వెనకబడిపోయాం...? పూర్తిగా జెల్లీపిష్ లాగా జీవిత చక్రాన్ని నియంత్రించుకోలేకపోయినా, కనీసం వందల, వేల సంవత్సరాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించే అవకాశమేలేదా...?...  ఈ కోణంలో పరిశోధనలు జరిపినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.  మరికొన్ని జంతువులు అనూహ్యంగా ఎక్కువ కాలం జీవించినట్టు తెలుస్తోంది.
ఎక్కువ కాలం జీవించే జంతువులు
1. టాటరా...ఇది ఒక రకం తొండ. నిండు నూరేళ్లు బతికుతున్నట్టు తేలింది.
2.  Lobster ఇది 140 సంవత్సరాలపాటు ఎంచక్కా బతికేస్తున్నది.
3. రెడ్ సీ అర్చిన్ అనే సముద్రజీవి హాయిగా 200 ఏళ్లు బతుకుతోంది.
4. బౌహెడ్ తిమింగలం ఏకంగా 211 సంవత్సరాల దాకా జీవించిఉన్నట్టు రికార్డ్ బుక్స్ లో నమోదైంది.
5. కోయి కార్ప్ అనే ఓ రకం చేపలు 226 సంవత్సరాలు జీవిస్తున్నాయి.
6. ఒక రకం పెద్ద తాబేలు  250 సంవత్సరాలపాటు జీవించింది.
7. ఆలుచిప్పలు కూడా తక్కువేం తినలేదు. చూడటానికి చాలా చిన్నవిగా ఉండే `సముద్ర క్యూహాగ్' అనే  ఆలుచిప్పలు 405ఏళ్లు జీవిస్తున్నాయి.
8.  అంటార్కిటిక్ ప్రాంతంలో కనిపించే స్పాంజ్. దీని వయసు ఎంతో తెలుసా....1,550 సంవత్సరాలు...!!
9.  ఇవన్నీ ఒక ఎత్తైతే... అసలు చావన్నదే ఎరుగని జంతువు టురిటోప్సిస్ న్యూట్రిక్యులా అనే జెల్లీ ఫిష్

(మనిషి కూడా వేలాది సంవత్సరాలు బతకొచ్చా...అదెలా సాధ్యం...వివరాలు తరువాయి భాగంలో...)
- తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!