9, ఏప్రిల్ 2011, శనివారం

హజారే అంటే ఎవరో తెలియదంటున్న రాంగోపాల్ వర్మ!

అన్నా హజారేపై రాంగోపాల్ వర్మ తనదైన బాణిలో స్పందించారు. వారంలో ఏదో రెండుమూడుసార్లు తన ట్విట్టర్లో అభిమానులను పలుకరించే వర్మ నిన్న రాత్రి  (08-04-11)ప్రత్యక్షమయ్యారు. ఓ అభిమాని, అన్నా హజారే అవినీతిపై చేస్తున్న ఉద్యమం గురించి పేజీకి సరిపడ స్పందన పంపించాడు.
దానికి వర్మ స్పందిస్తూ... ఎవరీ అన్నా హజారే..? నాకు తెలియదే..? నా సినిమాలతో నేను యమ బిజీగా ఉన్నా. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరికే లేకుండా ఉంది... అంటూ ప్రతిస్పందిచాడు.
నిరాహార దీక్ష గురించి మరో అభిమాని ప్రశ్న స్పందిస్తే... ఎపుడైనా వళ్లు చేస్తే ఆహారాన్ని మానివేసి కాస్త స్లిమ్‌గా తయారయ్యేందుకు తాను నిరాహార దీక్ష చేపడతానని వర్మ సమాధానమిచ్చారు. మొత్తానికి యావద్భారతదేశంలోని పల్లెపల్లెల్లో హజారే పేరు మోగుతుంటే వర్మకు మాత్రం హజారే ఎవరో తెలియదట. నమ్మేద్దామా...?!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి