సత్యసాయి అవతార సమాప్తి



యావత్ భారత జాతి నిశ్చేష్టమైంది. ఉన్నట్టుండి ఎల్లెడలా నిశ్శబ్దం చోటుచేసుకుంది. నడిచే దేవుడు భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా అవతారం చాలించినట్టు సెంట్రల్ ట్రస్టు ఆదివారం ఉదయం 10.10 గంటలకు ప్రకటించగానే భక్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఉదయం నుంచే బాబావారి బంధువుల్లో కొందరు పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్ళి బాబావారిని చూసివచ్చి కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆ పరిస్థితి చూడగానే భక్తుల గుండెలు పగిలే వార్త ఏదో రాబోతున్నదన్నట్టు అందరికీ అర్థమైంది. మహిమలు ప్రదర్శించడంలోనేకాదు, సకల మానవాళికి సేవలు అందించడంతో సత్యసాయిబాబా భగవత్ స్వరూపులయ్యారు. బాబా ఈ ఉదయం 7.40 గంటలకు తుది శ్వాస విడిచారని ఉదయం 10 గంటలు దాటాక ట్రస్టు అధికారిక ప్రకటన చేసింది. బాబా వారి భౌతిక వయస్సు 85 సంవత్సరాలు.
 గత నాలుగు రోజుల నుంచీ బాబా అంతిమ ఘడియల్లో ఉన్నారని తెలుస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఏదో అద్భుతం జరగకపోతుందా అని భక్తులు ఆశపడ్డారు.  అయితే సత్యసాయిబాబా అవతారం చాలించాలనే నిర్ణయం తీసుకోవడంతో వైద్యపరమైన చికిత్సలేవీ పనిచేయలేదని ట్రస్టు సభ్యులు ప్రకటించారు. బాబా భౌతికంగా దూరమైనా భక్తుల హృదయాల్లో శాశ్వతంగానే నిలిచిఉంటారు.
(శ్రీ భగవాన్ సత్యసాయి బాబావారి మహిమలు, వారితో మీ అనుభవాలను మాతో పంచుకోండి. nrturlapati@gmail.com కి పోస్ట్ చేయండి...)




- ఎడిటర్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!