జగన్ పై పోటీ కి ఓ తమిళ తంబీ

జగన్ పై పోటీ కి  ఓ తమిళ తంబీ ముచ్చట పడుతున్నాడు.నామినేషన్ల  వీరుడిగా తమిళనాట ప్రసిద్ధి గాంచినపద్మరాజన్  ఈ సారి మన రాష్ట్రం నుంచి అది కూడా జగన్ పై నామినేషన్ వేయబోతున్నారట. ఎవరీ రాజన్? ఏమిటీ కథ?? అని కూపీ లాగితే రాజన్ చరిత్ర చాంతాడంత వుంది.అసలు ఈ రాజన్ ది తమిళనాడు లోని సేలం జిల్లా మెట్టూర్.వయసు యాభై రెండు ఏళ్ళు .  గురుడు కి టైర్లను వల్కనైజ్  చేసే చిన్న వ్యాపారం కూడావుంది.ఎన్నికల్లో పోటీ చేయడమంటే రాజన్ కి మహా ముచ్చట .రాను రాను అది వ్యసనం గా మారి పోయింది.గిన్నేస్స్ బుక్ రికార్డ్ ల్లోకి ఎక్కాలని పట్టుదల పట్టాడు. కంకణం కట్టుకున్నాడు.అంతే! ఎన్నికలొస్తే సరి మన రాజన్ నామినేషన్లు వేయడానికి రెడి అయిపోతాడు.ఇప్పటివరకు  అంటే గత 23 ఏళ్ళలో  రాజన్ 121 నామినేషన్లను దాఖలు చేసాడు.గతంలో రాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణ నిధి పైన అలాగే మాజీ సీఎం జయలలిత పై కూడా పోటీ  చేసాడు. కేరళ వెళ్లి అంటోనీ  పై  నామినేషన్ వేసాడు.అన్ని చోట్లా ఓటమే ,అయినా నిరాశ పడలేదు.డిపాజిట్లు దక్కలేదు అయినా డస్సి పోలేదు.అది రాజన్ పరాక్రమం! పట్టుదల !! గెలుపు ఎరుగని ధీరుడు,విసుగు ఎరుగని వీరుడు .  మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు ,అటల్ బిహారీ వాజపాయ్ ల పైన పోటీ చేసేందుకు ఆయన వెనుకడుగు వేయలేదు .ప్రస్తుత ప్రధాని మన్మోహన్ పై కూడా పోటీకి సై అంటూ ప్రయత్నం చేసాడు .అది రాజ్యసభ ఎన్నిక కావడంతో మద్దత్తు పలికే వారు లేక నామినేషన్ పేపర్లను తిరస్కరించారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ సత్తా  చాటడానికి ఆరు మార్లు ప్రయత్నం చేసాడు.అయితే నామినేషన్ వేయడానికి కుదరలేదు,ఒక్క నారాయణన్ పై మాత్రం నామినేషన్ వేసాడు. ప్రస్తుతం రాజన్ మెట్టూర్ అసెంబ్లీ స్తానం నుంచి ఒక నామినేషన్ దాఖలు చేసారు.ఎవరు సలహా ఇచ్చారో ఏమో గానీ ఆంధ్రా పై కన్నేశాడు. కడపలో జగన్  పై  పోటీ చేయ బోతున్నారని ప్రచారం జరుగుతోంది. పోటీ చేస్తే చేయమనండి  కానీ సరదా పుట్టి ప్రచారం చేస్తే బాంబులు పడే ప్రమాదం వుందని   ఎవరైనా చెప్పండి బాబూ!అభ్యర్దులు లేక దొరకక  విలవిలలాడుతున్నపార్టీలు రాజన్ కి  సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా!బాబు, కిరణ్ గార్లకు ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి సారూ.   
                                                                                               - jaijainayaka   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!