జగన్ కు దూరం అయిన జీవిత రాజశేఖర్



గత కొద్ది రోజులుగా ప్రముఖ సినీనటులు జీవిత, రాజశేఖర్ లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కడప ఉప ఎన్నికలలో జగన్ పూర్తి బిజీగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు నటులు జగన్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి జగన్ కు వ్యతిరేకంగా భారీ విమర్శలే చేశారు. తాము వై.ఎస్.రాజశేఖరరెడ్డి మీద గౌరవంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరామని, అయితే జగన్ తమ పట్ల చిన్నచూపు చూశారని , తాము అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. విజయవాడ దీక్ష లో తమ అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి జగన్ భయపడ్డారనిపించిందని ఆయన అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ దీక్షకు పిలవలేదని ఆయన తెలిపారు.ఆ తర్వాత తమను దూరం పెట్టారని, అందుకు సంతోషిస్తున్నామని జీవిత,రాజశేఖర్ లు పేర్కొన్నారు. జగన్ సంపాదించిన ఆస్తులకు సంపాదించి వివరణ ఇవ్వాలని కూడా వారు డిమాండు చేశారు. అయితే జీవిత తనకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మహిళా అద్యక్షపదవి అడిగారని, దానిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడం వారికి అసంతృప్తి కలిగిం ఉండవచ్చని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు.కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి ఆకట్టుకుని ఉండవచ్చని అంటున్నారు. మరో ప్రముఖ నటి రోజాకు అధికా ప్రాముఖ్యత ఇచ్చి తమకు ఆ స్థాయిలో ఇవ్వలేదన్న అసంతృప్తితోనే జీవిత,రాజశేఖర్ లు జగన్ కు దూరం అయ్యారని అంటున్నారు.,

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!