బర్నింగ్ కామెంట్రీ - 10 (బాబా ఆరోగ్య చిదంబర రహస్యం..)

                                                               `ట్రస్ట్' కోల్పోయిన ట్రస్టు!

నీకంటి చూపే చాలు
శతకోటి దీవెనల పెట్టు
నీచేతి స్పర్శేచాలు
శతాయుష్షుతో ధన్యమవును బతుకు
బాబా, నీవే మా ప్రాణం

అంటూ....
నీ చుట్టూ తిరిగిన భక్త ఘనం
నీ సేవా జనంలో కొందరే వారి
కంటిచూపుతో నిన్ను శాసిస్తూ
వేలాది కోట్ల కొరకు నిన్ను బాధిస్తూ
రోజుకో విధంగా `చంపేస్తుంటే'

హే భగవాన్...
ట్రస్టు కోల్పోయిన నీ ట్రస్టులో
ఇంకెన్ని ట్విస్టులు చూడాలో సామీ
నీ దర్శన భాగ్యం కాదు
మాకు నీ `భాగ్యం'కావాలని నీవేలాది కోట్లు
విదేశాలకు తరలిపోతున్నాయ్

మరి నీ ఆరోగ్యం వెనకున్న
చిదంబర రహస్యం తెలిపేదెవరో సామీ...?

                                                                        -నీల్ కొలికపూడి

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!