చిరంజీవి, కాంగ్రెస్‌ కొత్తపూజారి

కొత్తపూజారికి పంగనామాలు ఎక్కువంటారు. అలాగే కొత్తగా తీర్థం పుచ్చుకున్నవారికి ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది. కాంగ్రెస్‌లో విలీనమవుతున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఇలాంటి అనుభూతులోనే మునుగుతేలుతున్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా చిరంజీవి ప్రజాకర్షణ శక్తిని గుర్తించి , ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సైతం అగ్రతాంబూలం ఇవ్వడంతో ఆయన ఆనందానికి అవధులుండటం లేదు. కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చిరంజీవి తనకు కాంగ్రెస్‌లో చేరడం గర్వంగా ఉందని ప్రకటించారు. కాంగ్రెస్‌ను మట్టికరిపించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని కానీ వారే మట్టికరుస్తారని చిరంజీవి ధ్వజమెత్తారు. బహుశా రాష్ట్రరాజకీయాన్ని దృష్టిలో ఉంచుకునే వైఎస్ జగన్‌పై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. నిన్న, మొన్నటిదాకా కాంగ్రెస్‌పై చిరు విమర్శలు వర్షం కురిపిస్తే, ఈయన సోదరుడు పవన్ కళ్యాణ్‌ ఒకప్పుడు కాంగ్రెస్‌నేతలను పంచెలూడేలా తరమాలని పిలుపునిచ్చారు. ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్‌లో కలవడం గర్వంగా ఉందని చెప్తున్నారు. మొత్తంమీద రాజకీయాలు వంటపట్టించుకుంటున్నారన్నమాట.అయితే కర్నాటక పర్యటనలో జనం భారీగా తరలిరావడంతో ఆయనకు మరింత ఉత్సాహాన్ని కల్గించింది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!