మరణం లేని జీవి (పార్ట్ 3) - మరణం లేకపోతే మనిషి దేవుడైపోతాడా?!
మరణం లేనంత మాత్రాన మానవుడు దేవుడు అయిపోతాడా...? కోట్లాది సంవత్సరాల కిందట మానవులు, దేవతలు కలిసే జివించారా? అదే నిజమైతే ఆ పరిస్థితి మళ్ళీ సాధించుకోగలమా...?
దేవతలు అమరులనీ, వారు ఈ భూమిని రక్షించడానికే ఉన్నారన్న విషయం, అన్ని మత గ్రంధాల్లో నిక్షిప్తమై ఉంది. అమృతం కోసమే దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అమృతం తాగిన దేవతలకు అమరత్వం సిద్ధించింది. అందుకే అమరులయ్యారు. కానీ ఆ యోగం రాక్షసులకు రాలేదు. ఇక మానవులు దేవతలతో సన్నిహితంగా మెలిగినట్టు అన్ని మతాల్లో ఉంది. వీరు కూడా వేలాది సంవత్సరాలు ఎంతో ఉత్సాహంగా జీవించినా, దేవతల్లాగా అమరులు కాలేకపోయారు. ఒక వేళ అమరత్వం సాధించినా మానవులు ఎప్పటికీ దేవతలు కాలేకపోయారని అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
అనేక కారణాల వల్ల కోల్పోయిన జీవన ప్రమాణాన్ని తిరిగి సంపాదించుకోవాలని మానవుడు ఆరాటపడుతున్నాడు. ఈ భూమి మీదనే అమరత్వం సాధించిన జంతువు ఉన్నప్పుడు, మరికొన్ని వేలాది సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు తాను ఎందుకు అమరత్వాన్ని సాధించకూడదని మనిషి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని మొక్కను తీసుకురావడం కోసం బయలుదేరి, చివరకు దాన్ని గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకువెళతాడు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ, నేటి శాస్త్రవేత్తలు సంజీవని మొక్కను గుర్తించినట్టు చెబుతున్నారు. మృతకణాల్లో జీవలక్షణాలు తీసుకురాగల శక్తి కొన్ని మొక్కల్లో ఉన్నట్టు వారు చెబుతున్నారు.
కొత్త కణాన్ని సృష్టించిన మానవుడు అమరత్వాన్ని సంపాదించాలని కూడా తపనపడిపోతున్నాడు. ఎప్పటికైనా మృత్యువును జయించి, వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనాన్ని సంపాదించాలని ఆశపడుతున్నాడు.
మరణాన్ని జయించడం సాధ్యమైతే, మనిషిలోని మృగం మేల్కొంటుంది. అప్పుడు జరిగేది అంతా వినాశనమే. ప్రకృతి ధర్మాన్ని శాసించాలని చూస్తే, దేవతగా మారడం అటుంచి, అసలు మానవత్వమే మరుగునపడే ప్రమాదం లేకపోలేదు.
మానవ మేథస్సు పెరుగుతున్నకొద్దీ, ఈ సృష్టిలో కొత్తకొత్త విషయాలు అవగతమవుతున్నాయి. జనన-మరణాల చక్రంతో సంబంధంలేకుండా జీవితం సాగిస్తున్న ఒక రకం జెల్లీఫిష్ రేపటి మన ఆశలకు బీజంవేసింది. ఎప్పటికైనా మృత్యుంజయులు కావాలన్న మన తపన తీరే రోజు దగ్గర్లోనే ఉన్నదా...? ఏమో....ఎవరు చెప్పగలరు...కాలమే సమాధానం చెప్పాలి...

- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి