విజయవాడకు రాహుల్ గాంధీ


ఎ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి, లోక్ సభ సభ్యుడు, సోనియాగాందీ కుమారుడు రాహుల్ గాందీ ఈనెలలో విజయవాడ రావచ్చు. ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకావచ్చని కధనాలు వస్తున్నాయి. బహుశా ఏప్రిల్ 18 లేదా 20 వ తేదీనాడు ఈ సభ జరగవచ్చు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, పార్టీ ఆవిర్భావంనాడు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఇప్పుడు విలీన సభను కూడా అంత సవాలుగా తీసుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో తన ప్రభ వెలగాలంటే, విజయవాడలో తలపెట్టిన విలీన సభను గ్రాండ్ గా జరపవలసిందేనని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ విలీన సభకు విశాఖపట్నం, రాజమండ్రి మొదలైన నగరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నా, విజయవాడ అయితే అన్నిటికీ కేంద్రంగా ఉంటుందని భావించి విజయవాడ వైపే మొగ్గు చూపారని, దాదాపు ఇదే ఖరారు కావచ్చని చెబుతున్నారు. కాగా ఈ సభకు సోనియా వచ్చే అవకాశాలు తక్కువేనని, అందువల్లే రాహుల్ పొల్గొంటారని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!