జగన్ కు ఏమైనా పిచ్చా



వచ్చే కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలు సోనియాగాంధీకి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి మధ్య పోటీ అని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనడాన్ని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్రంగా ఆక్షేపించారు. సోనియాగాంధీకి, రాజశేఖరరెడ్డికి పోటీ ఏమిటి? ఆయనకు ఏమైనా పిచ్చా.. అసలు ఆయన ఏమి మాట్లాడుతున్నారో తెలుసా?మూర్ఖత్వం కాకపోతే మిటి? అని డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన చివరి క్షణం వరకు సోనియాగాంధీకి విధేయుడుగా ఉన్నారని, బహుశా చనిపోతూ కూడా పోనియా గాంధీ గురించే ఆలోచించి ఉంటారని డి.ఎస్ అన్నారు.
మరో నేత వి.హనుమంతరావు కూడా జగన్ ప్రకటనను మూర్ఖత్వంగా అభివర్ణించారు. జగన్ ను కాంగ్రెస్ నుంచి ఎవరూ బయటకి వంపలేదని, ఆయనే కాంగ్రెస్ వదలి వెళ్లారన్న సంగతి గుర్తు ఉంచుకోవాలని
వి.హెచ్ అన్నారు. విశేషం ఏమిటంటే డి.ఎస్. , వి.హెచ్ తప్ప మిగిలిన నేతలెవ్వరూ కూడా జగన్ సెంటిమెంటు ప్రకటనకు వ్యతిరేకంగా విమర్శలు చేయకపోవడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!