3, ఏప్రిల్ 2011, ఆదివారం

సాఫ్ట్వేర్ సత్తి - కాపీ పేస్టు థీరీ (ఎపిసోడ్ 3)


'ఓహ్ మై గాడ్!! నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్... ఎప్పుడు వచ్చావ్ ? '
(నేను ఇంత ఎందుకు భయపడ్డానో కాసేపట్లో మీకే తెలుస్తుంది)
'నీ ఫ్లాష్-బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు వచ్చాను... నీ ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత చాలా బాధ గా ఉంది సత్తి... ఐ యాం వెరీ సారి ఫర్ యు... కాని నాకో డౌట్...' అ౦ది స్రవంతి
స్రవంతి - ఇది మామూలు స్రవంతి కాదు డౌట్ ల స్రవంతి....దీని డౌట్ ల తాకిడి కి తట్టు కోలేక దీని స్కూల్ టీచర్ ఒకడు రాజీనామ కూడా చేసాడట... దీనికి 'DOUBT' అనే పదం లో B అనే అక్షరం అనవసరం గా ఎందుకు ఉందో కూడా డౌటే.... DOUBT మీదే డౌట్ వ్యక్తం చేసిందంటే ఈమె డౌట్ల డెప్త్ ఏమిటో మీకు ఈ పాటికే అర్థమయ్యుంటుంది. C లాంగ్వేజ్ కి సెమికోలన్ ఎలాగో... దీని లాంగ్వేజ్ కి క్వశ్చన్ మార్క్ అలా... ప్రతి సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ తోనే ఎండ్ అవుతుంది....
ఏదో తంగవేలు గాడిని మేనేజ్ చేయడానికి నోటికొచ్చిన ఫ్లాష్-బ్యాక్ చెప్పాను... వాడు అది నిజమని నమ్మేసాడు... మధ్యలో ఈ స్రవంతి సీన్ లోకి ఎందుకు వచ్చింది రా బాబు... దీని డౌట్ ల కు ఆన్సర్ చేయడం కన్నా..తెలంగాణా సమస్యని తీర్చడం తేలిక...... దేవుడా.. దీని డౌట్ ల కు ఆన్సర్స్ ఇచ్చే శక్తి ని ఇవ్వు....
' ఆ నీ డౌట్ ఏమిటి...' అని ధైర్యం చేసి అడిగాను
'అవును.... నీ ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్ సుబ్బారావు ఎగ్జామ్స్ పాసయ్యడా?'
(ఇది డౌటా!!... వాడు పాసయితే దీనికెందుకు...... పాసు కాకపొతే దీనికెందుకు... రిలీజ్ అవ్వని సినిమాకి రివ్యూ అడిగే ఫేసూ ఇది..)
'పాసయ్యాడు' అని వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాను..
'ఓహ్... మరీ... మీ ఫ్రెండ్ కీ.. చంద్రిక కి పెళ్లయిందా?'
(ఇంకా నయం పెళ్లి భోజనం లో ఏ స్వీట్ వేసారని అడగలేదు.....)
'అయింది'
'వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా?'
(అమ్మ బాబోయ్... అవి ప్రశ్నలా.. TV9 బులిటెన్లా ఒక దాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా వస్తున్నాయి ...)
'ఒప్పుకున్నారు' అన్నాను
'ఎలా ఒప్పుకున్నారు?'
(అదేం ప్రశ్నే?! ... ప్రశ్నల పిశాచి.... నిన్నెవడు చేసుకుంటాడో కానీ.. వాడి ఫోటో కీ దండేసి దండం పెట్టుకోవచ్చు.....)
'తెలీదు' అన్నాను
'సరే... మరీ.. నీకు ఏ ప్రొగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లు రాకపోతే... ఇంటర్వ్యూ లో ఎలా సెలెక్ట్ అయ్యావు... జాబు ఎలా వచ్చింది?'
అప్పటి వరుకూ కూల్ గా కనిపించిన తంగవేలు ఫేస్ లో కుడా క్వశ్చన్ మార్క్ కనిపించింది... అమ్మనీ! ఇది నా ఫ్లాష్ బ్యాక్ ని రోల్ బ్యాక్ చేయడానికే వచ్చినట్టు ఉంది ... ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి..
'పిచ్చిదాన!... తెలుగు సినిమా తీయాలంటే స్టొరీ కావాలా?... సాఫ్ట్ వేర్ ఇన్జినీర్ అవ్వాలంటే ప్రొగ్రామ్మింగ్ రావాలా?... అంతా కాపీ పేస్టు.. అది తెలిస్తే చాలు.'
'చీ.. కాపి పేస్టా.. కాపి పేస్టు చేసే వాళ్ళని ప్రోగ్రామర్ లని అ౦టారా?....'
'అస్సలు అనరు.. ఛీ ... కాపీ పేస్టు చేసేవాళ్ళంటే నాకు అసహ్యం...' అని స్టేట్ మెంట్ ఇచ్చాడు B గోపాల్..
వీడినెవడు మాట్లాడమన్నాడు... టాపిక్ తెలీక పోయినా నోటికొచ్చిన స్టేట్ మెంట్ లిచ్చే సెకండ్ గ్రేడ్ పోలిటిషియన్ ఫేసూ వీడూ....
'అవును కరెక్ట్... అయినా సత్తి... నువ్వు ఎవరిదో కోడ్ ని కాపీ పేస్టు చేసి కోడ్ రాస్తావా? అందుకే నీ కోడ్ లో అన్ని తప్పులు ఉంటాయి' అన్నాడు తంగవేలు...
అయిపోయింది అనుకున్నదంతా అయిపోయింది... తంగవేలు గాడి మనసు మారిపోయింది... ఇప్పుడు అర్థమయిందా స్రవంతి అంటే ఏమిటో ...... 10 పరుగులకే 8 వికెట్లు పడ్డ క్రికెట్ టీం లాగా అయింది నా పరిస్థితి....
ఇప్పుడు ఏం చేయాలి...?
..... ఇంతలో కాంటీన్ లోని టీవీ లో ఒక సీన్ వస్తోంది... అది NTR సినిమా లోని సీన్... నా కాపీ పేస్టు థీరీ మళ్లీ నాకు హెల్ప్ అయ్యింది... నా డైలాగ్ మొదలయింది.....
'ఏమంటివి.. ఏమంటివి.... కాపీ పేస్టు అంటే అసహ్యమంటివా?? ఎంత మాట!.. ఎంత మాట!....
ఏరా B గోపాల్ ... నువ్వు రోజూ కొలిచే.. నీ ఇష్ట దైవం శ్రీ రాముడు ఎవరు... వైకుంటం లో రెస్ట్ తీసుకుంటున్న విష్ణు మూర్తి ని కాపీ చేసి త్రేతాయుగం లో పేస్టు చేస్తే వచ్చిన అవతారమే కదా...
అంత దాకా ఎందుకు... నీ ఫేవరెట్ హిందీ సినిమా 'భూల్ భులయ్య' ... తమిళ్ 'చంద్రముఖి' కి కాపీ పేస్టు కాదా?... ఆ 'చంద్రముఖి' కన్నడ 'ఆప్త మిత్ర' కి... ఆ 'ఆప్త మిత్ర' మలియాళం సినిమా 'మనిచిత్ర తాళ్' కి కాపీ పేస్టులు కావా?....
నువ్వు రోజూ టీవీ లో చూసే 'ఇండియన్ ఐడల్' ప్రోగ్రాం... ఎక్కడి నుంచి వచ్చి౦దనుకున్నావు రా నీ XXX (బూతు).... అది 'అమెరికన్ ఐడల్' కి కాపీ పేస్టు రా....
అంతెందుకు మన భారత దేశ రాజ్యాంగమే ఒక పెద్ద కాపీ పేస్టు... బ్రిటిష్ వారి నుంచి కాపీ పేస్టు చేసి రాసిందే అంతా..
ఇవన్నీ కాదు... రోజూ మన తంగవేలు గాడు అద్దం లో చూసుకొనే వాడి ఫేసు కుడా కాపీ పేస్టే.... వాడి ముక్కు వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాపీ పేస్టు చేస్తే వచ్చింది.... వాడి కళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరనుంచి కాపీ పేస్టు చేస్తే వచ్చాయి....
కాపీ పెస్టే లేకపోతే సినిమా లేదు... టీవీ లేదు.... దైవం లేదు.... దేశం లేదు...దేహం లేదు... ఉద్యోగం కూడా లేదు..
అసలు కాపీ పేస్టు అనే ఫంక్షనాలిటినే లేకపోతే ఈ ప్రపంచమే లేదు.... '
'ఇక్కడ స్రవంతి లేదు...' అన్నాడు B గోపాల్
'ఏమై౦దీ ??' అని అడిగాను
'ఎప్పుడో వెళ్ళిపోయింది...' అన్నాడు
'ఓహ్... అవును వీడేంటి ఇలా ఏడుస్తున్నాడు...' అని అడిగాను
'నన్ను క్షమించు సత్తీ ... క్షమించు... కాపీ పేస్టు గొప్ప తనం తెలీక ఏదో అనేశా... నువ్వు కాపీ పేస్టు చేసి కోడ్ పంపు వెంటనే ఓకే చేస్తాను..' అని ఏడుస్తూ చెప్పాడు టెస్టర్ తంగవేలు
హమ్మయ్య.. ఆ స్రవంతి వినకపోయినా... B గోపాల్ గాడు నమ్మకపోయినా.. మనకొచ్చే నష్టం లేదు... తంగవేలు గాడు మళ్లీ నా బుట్ట లో పడ్డాడు...ఇది చాలు...
'నువ్వు మరీ అంత బాధ పడకు తంగవేలు.... కాపీ పేస్టు సంగతి తర్వాత... ముందు ఈ కాఫీ వేస్టు కాకుండా తాగేయి.. అప్పుడు వెళ్లి పని చేసుకుందాం' అన్నాను
అలా.. తంగవేలు టెస్టింగ్ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అయింది... ఇది జరిగిన రెండు వారాలకి... ఒక రోజు.....
-- to be continued

-Rajesh Turlapati

3 వ్యాఖ్యలు:

  1. ఆ 'చంద్రముఖి' కన్నడ 'ఆప్త మిత్ర' కి... ఆ 'ఆప్త మిత్ర' మలియాళం సినిమా 'మనిచిత్ర తాళ్' కి కాపీ పేస్టులు కావా?....

    :D :D

    ప్రత్యుత్తరంతొలగించు